ఆంధ్రాలో ప్రతీకార రాజకీయాలు మొదలయినట్లేనా ?

ఒకప్పుడు పోరుగున ఉన్న తమిళనాడు ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది అక్కడ డిఎంకె కి -అన్నాడిఎంకె పార్టీలు ఒకరు అధికారంలో ఉంటే మరొక వర్గం నేతలను, వారి అధినేతలను జైలుకు పంపిస్తూ ప్రతీకార రాజకీయాలు చేసేవారు .తనను అసెంబ్లీలో చీరలాగి అవమానించారు అన్న కోపాన్ని మనసులో పెట్టుకున్న అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత డీఎంకే అధినేత కరుణానిధిని( Jayalalithaa ) అర్ధరాత్రి పంచే ఊడదీసి మరీ జైలు పాలు చేశారని కదలు కదలు గా చెప్పుకుంటారు .

 Revange Politics Started In Andhra , Democracy , Ap Politics , Karunanidhi , Y-TeluguStop.com

ఇప్పుడు ఆ ప్రతీకార రాజకీయాల వారసత్వాన్ని తెలుగు రాజకీయనేతలు అందిపుచ్చుకున్నారా ? అన్నట్టుగా వ్యవహారాలు కదులుతున్నాయి.

Telugu Ap, Chandrababu, Democracy, Jayalalithaa, Karunanidhi, Ysjagan-Telugu Pol

రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు( Chandrababu naidu )తో శత్రుత్వం కనిపించినప్పటికీ అదంతా కేవలం రాజకీయ శతృత్వం గానే ఉండేది .బయట కనిపిస్తే మాత్రం ఇద్దరూ స్నేహం గానే మాట్లాడుకునేవారు .అయితే జగన్ ముఖ్యమంత్రి( YS Jagan Mohan Reddy ) అయిన తర్వాత ఆ పరిస్థితుల లో మార్పు కనిపిస్తుంది .ముఖ్యంగా తాను 16 నెలలపాటు జైలు పాలు అవ్వడానికి సోనియా గాంధీకి మద్దతు ఇచ్చిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారని భావిస్తున్న జగన్ ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు పాలు చేయాలనే కృత నిశ్చయం తో ఉన్నారని ఇంతకాలం నుంచి తీగ లాగితే ఇప్పుడు డొంక దొరికిందని దానిని అందిపుచ్చుకొని సాధ్యమైనంత ఎక్కువ కాలం చంద్రబాబును జైలు పాలు చేసేందుకే జగన్ పావులు కదుపుతున్నారని, ఇంతే కాకుండా దీనిని అనుసరిస్తూ మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని, వచ్చే ఆరు నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాలు కీలక దశకు చేరుకుంటాయని తన ఆఖరి ఆస్త్రాలన్నీ వచ్చే కొన్ని రోజులలో జగన్ ప్రయోగిస్తారని తెలుగు మీడియా వరుస కథనాలను వండి వారుస్తుంది.

Telugu Ap, Chandrababu, Democracy, Jayalalithaa, Karunanidhi, Ysjagan-Telugu Pol

తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంటా అంటా అంటూ అధికారం సాధించిన ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలను కనుమరుగచేసే నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి ( Democracy )అర్దం మారిపోతుంది.రాజకీయ శత్రుత్వం నుంచి వ్యక్తిగత పగదాకా దిగజారిపోతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముందు ముందు మరింత బీతావాహమైన పరిస్థితులకు ప్రజలు సాక్షీభూతం గా మిగులుతారేమో ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube