హైయ్యెస్ట్ రేంజ్ ఆఫర్ చేస్తున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే...

ప్రభుత్వం సబ్సిడీని తగ్గించినప్పటికీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.ఈ స్కూటర్లు కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా హై రేంజ్‌తో అందుబాటులోకి వస్తున్నాయి.

 These Are The Top Electric Scooters Offering The Highest Range, Electric Scooter-TeluguStop.com

ఇప్పటివరకు రిలీజ్ అయిన స్కూటర్లలో చాలావరకు 100కి.మీకు పైగానే రేంజ్ అందిస్తున్నాయి.

సింగిల్ ఛార్జింగ్‌తో హైయ్యెస్ట్ రేంజ్ కలిగిన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను చూద్దాం.

• సింపుల్ వన్:

సింపుల్ వన్ స్కూటర్‌లో ఫిక్స్‌డ్, రిమూవబుల్( Fixed, removable ) అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి.ఈ బ్యాటరీ ప్యాక్‌ల మొత్తం కెపాసిటీ 5kWh, ఇది స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.దీని ధర రూ.1.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్).

• ఓలా S1 ప్రో Gen 2:

ఈ స్కూటర్ మునుపటి వెర్షన్ మాదిరిగానే 4kWh బ్యాటరీ ప్యాక్‌తో 195 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని ధర రూ.1,47,327 (ఎక్స్‌-షోరూమ్).

• ఓలా S1 ప్రో:

భారతదేశంలో బాగా పాపులర్ అయిన ఓలా S1 ప్రో స్కూటర్( Ola S1 Pro Scooter ) చాలా ఫీచర్లతో వస్తుంది.ఇది 4kWh బ్యాటరీ ప్యాక్, 181 కిలోమీటర్ల క్లెయిమ్ రేంజ్ కలిగి ఉంది.

• హీరో విడా V1 ప్రో:

హీరో విడా V1 ప్రో స్కూటర్( Hero Vida V1 Pro Scooter ) ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతోంది.ఇది 3.94kWh బ్యాటరీ ప్యాక్, 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.దీని ధర రూ.1.25 లక్షలు.

• ఏథర్ 450X Gen 3:

ఈ స్కూటర్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో బాగా పాపులర్ అయింది.ఇది 3.7kWh బ్యాటరీ ప్యాక్, 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.ఈ స్కూటర్లన్నీ పర్ఫామెన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే ఎక్కువ కి.మీల రేంజ్ అందిస్తున్నాయి.రేంజ్ గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులకు ఇవి మంచి ఎంపిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube