తెలంగాణలో కేసిఆర్( CM kcr ) ను గద్దె దించాలని, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఆయనను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు( Congress party bjp ) గట్టి పట్టుదలతో ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
అయితే బిఆర్‌ఎస్ ను ఓడించడానికి కంటే ముందు ఈసారి కేసిఆర్ ను ఓడించాలని ప్లాన్ చేస్తున్నాయి.ఈసారి కేసిఆర్ రెండు నియోజిక వర్గాల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి డిగనున్నారు.
కాగా కేసిఆర్ ను ఢీ కొట్టేందుకు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ ఇంకా కసరత్తులు చేస్తుండగా.బీజేపీ మాత్రం ఒక్క అడుగు ముందే ఉండి బలమైన నేతలను బరిలో నిలిపే ప్లాన్ లో ఉంది.
గజ్వేల్ నుంచి కేసిఆర్ కు పోటీగా బీజేపీ తరుపున ఈటెల రాజేందర్( Etela Rajender ) పోటీ చేయబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈటెల కూడా కేసిఆర్ పై పోటీ చేసేందుకు ఆసక్తిగానే కనిపిస్తున్నారు.కేసిఆర్ ను ఎలాగైనా ఒడిస్తానని శపథం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన గజ్వేల్ బరిలో నిలిచేందుకు దరఖాస్తు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో కేసిఆర్ కు పోటీగా ఈటెల దాదాపు కన్ఫర్మ్ అని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది.కాగా ఈటెల బిఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్ళినప్పటికి కేసిఆర్ గాని కేటిఆర్ గాని అప్పుడప్పుడు ఆయనపై సానుకూలంగానే స్పందిస్తూ వచ్చారు.
ఒకవేళ కేసిఆర్ కు పోటీగా ఈటెల ఖరారు అయితే కేసిఆర్ అండ్ కొ ఈటెలపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరం.
ఇక కామారెడ్డి నుంచి కేసిఆర్ కు పోటీగా ధర్మపురిని బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది.అయితే ఈటెల మాదిరి కేసిఆర్ ను ఢీ కొట్టే సత్తా దర్మపురికి లేదని బీజేపీలోని ఒక వర్గం భావిస్తోందట.దీంతో బండి సంజయ్ ( Bandi Sanjay Kumar )ని బరిలో దించేతే ఎలా ఉంటుందనే దానిపై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే కేసిఆర్ ను ఓడించడం అంటే అంతా తేలికైన విషయం కాదు.అయినప్పటికి ఈసారి ఓడించడం ఖాయమని బీజేపీ చెబుతోంది.ఎందుకనే కుటుంబపాలన, అవినీతి అంశాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలం పార్టీ భావిస్తోంది.అందుకోసం కమలం పార్టీ పెద్దలు ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నారు ? వారి వ్యూహరచన ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.