అమెరికాలోని మిచిగాన్ లో ఓ ప్రముఖ రెస్టారెంట్ లో పనిచేస్తున్న మహిళా వెయిటర్ కి దిమ్మతిరిగేలా టిప్ ఆఫర్ ఇచ్చాడు అమెరికన్ పాప్ గాయకుడు డానీ వాల్బెర్గ్.2020 ఛాలెంజ్ పుణ్యమానని ఆ వెయిటర్ కి భారీ మొత్తంలో టిప్ అందే సరికి ఆమె ఆనందానికి అవధులు లేవు.అసలే కొత్త సంవసత్సరం కావడం తాను ఆ హోటల్ లో చేరి రెండో రోజున ఇలాంటి భంపర్ ఆఫర్ తగలడంతో ఆమె ఇప్పటికి కోలుకోలేని పరిస్థితిలో ఉందట.ఆ వివరాలలోకి వెళ్తే.
ఆమె పేరు డేనియల్ ప్రాంజొని.మిచిగాన్ కి చెందిన ఈమె రెండు రోజుల క్రితమే దండర్ బె రివర్ రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరింది.
కస్టమర్ గా వచ్చిన డానీ ఆర్డర్ ఇచ్చాడు.తినడం పూర్తవ్వగానే అతడు బిల్లు తీసుకురమ్మని చెప్పాడు.
ఆమె బిల్లు ఇవ్వగానే డబ్బులు ఇచ్చి ఆ బిల్లుపై 2020 డాలర్లు టిప్ ఇస్తునాను ఇది 2020 ఛాలెంజ్ అని రాశాడు.ఆమె చేతికి ఇచ్చేసి అక్కడి నుంచీ అతడు వెళ్ళిపోయాడు.
తరువాత ఆ స్లిప్ చూసిన ఆమెకి నోటి మాట రాలేదు.అతడికి కృతజ్ఞతలు తెలుపుదామంటే అతడు లేదు.ఆ టిప్పు చూసి ఉబ్బితబ్బిబ్బై న ఆమె తనకి సొంత ఇల్లు లేదని కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఈ టిప్పు అందుకుగాను దాచుకుంటానని తెలిపింది.కొత్తం సంవసత్సరం ఆమెకి నిజంగానే మాంచి బోణీ ఇచ్చింది.