భారత సంతతి మహిళపై జాత్యహంకార దాడి.. సింగపూర్ పౌరుడిపై కేసు

ఇటీవలికాలంలో సింగపూర్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి.స్థానిక సింగపూర్ వాసులతో పాటు అక్కడ స్థిరపడిన ఇతర దేశాల ప్రజలు సైతం భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

 Singaporean Man Charged Over Racially Aggravated Attack Against Indian-origin Wo-TeluguStop.com

తాజాగా భారత సంతతి మహిళపై దాడి చేసిన ఓ సింగపూర్ యువకుడిపై కేసు నమోదైంది.ఈ ఏడాది మేలో 55 ఏళ్ల బాధితురాలి ఛాతీపై నిందితుడు కాలితో తన్నాడు.

ఇది జాతి విద్వేష దాడిగా తేలటంతో అతనిపై తాజాగా అధికారులు కేసు నమోదు చేశారు.

వాంగ్ జింగ్ ఫాంగ్ (30) అనే యువకుడు మే 7న సింగపూర్‌లో ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్న హిండోచా నీతా విష్ణుభాయ్‌ ఛాతీపై కుడి కాలితో తన్నినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.

నిందతుడు దాడికి ముందు నీతా జాతిపై అసభ్యకర పదజాలాన్ని వుపయోగించాడని కథనంలో పేర్కొంది.ఆమె జాతిపరమైన భావాలను గాయపరచడంతో పాటు తీవ్రమైన దాడికి పాల్పడినందుకు గాను వాంగ్‌పై శుక్రవారం అధికారులు కేసు నమోదు చేశారు.

ఘటన జరిగిన రోజున నీతా స్లీవ్ లెస్ టాప్, ట్రాక్ ఫ్యాంటు ధరించి వేగంగా నడుస్తుండటంతో శ్వాస కోసం మాస్క్‌ను ముక్కు నుంచి తీసి కేవలం నోటి వరకే వుంచింది.దీనిని గమనించిన వాంగ్.

మాస్క్ పూర్తిగా ధరించాలని గట్టిగా కేకలు వేశాడు.అయితే తాను వ్యాయామం చేస్తున్నానని అందుకే మాస్క్ తొలగించినట్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా నీతాను వాంగ్ అభ్యంతకర పదజాలంతో దూషించాడు.

దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.కానీ అతను నీతా వైపు వేగంగా పరిగెత్తుకొచ్చి.ఛాతీపై ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు.ఆ దెబ్బకు విష్ణుభాయ్ కిందపడిపోగా చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

జరిగిన సంఘటనపై నీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనను సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ సహా పలువురు మంత్రులు మే 10న వేర్వేరు ఫేస్‌బుక్ పోస్టులలో ఖండించారు.

ఇక ఈ కేసుకు సంబంధించి నిందితుడు వాంగ్.ప్రీ ట్రయల్ అక్టోబర్ 8న జరుగుతుంది.జాతి విద్వేషపూరిత దాడిలో అతని నేరం రుజువైతే వాంగ్‌కు 4.5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 7,500 సింగపూర్ డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube