భారత సంతతి మహిళపై జాత్యహంకార దాడి.. సింగపూర్ పౌరుడిపై కేసు
TeluguStop.com
ఇటీవలికాలంలో సింగపూర్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి.స్థానిక సింగపూర్ వాసులతో పాటు అక్కడ స్థిరపడిన ఇతర దేశాల ప్రజలు సైతం భారతీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
తాజాగా భారత సంతతి మహిళపై దాడి చేసిన ఓ సింగపూర్ యువకుడిపై కేసు నమోదైంది.
ఈ ఏడాది మేలో 55 ఏళ్ల బాధితురాలి ఛాతీపై నిందితుడు కాలితో తన్నాడు.
ఇది జాతి విద్వేష దాడిగా తేలటంతో అతనిపై తాజాగా అధికారులు కేసు నమోదు చేశారు.
వాంగ్ జింగ్ ఫాంగ్ (30) అనే యువకుడు మే 7న సింగపూర్‌లో ప్రైవేట్ ట్యూటర్‌గా పనిచేస్తున్న హిండోచా నీతా విష్ణుభాయ్ ఛాతీపై కుడి కాలితో తన్నినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.
నిందతుడు దాడికి ముందు నీతా జాతిపై అసభ్యకర పదజాలాన్ని వుపయోగించాడని కథనంలో పేర్కొంది.
ఆమె జాతిపరమైన భావాలను గాయపరచడంతో పాటు తీవ్రమైన దాడికి పాల్పడినందుకు గాను వాంగ్‌పై శుక్రవారం అధికారులు కేసు నమోదు చేశారు.
ఘటన జరిగిన రోజున నీతా స్లీవ్ లెస్ టాప్, ట్రాక్ ఫ్యాంటు ధరించి వేగంగా నడుస్తుండటంతో శ్వాస కోసం మాస్క్‌ను ముక్కు నుంచి తీసి కేవలం నోటి వరకే వుంచింది.
దీనిని గమనించిన వాంగ్.మాస్క్ పూర్తిగా ధరించాలని గట్టిగా కేకలు వేశాడు.
అయితే తాను వ్యాయామం చేస్తున్నానని అందుకే మాస్క్ తొలగించినట్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా నీతాను వాంగ్ అభ్యంతకర పదజాలంతో దూషించాడు.
దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.కానీ అతను నీతా వైపు వేగంగా పరిగెత్తుకొచ్చి.
జరిగిన సంఘటనపై నీతా పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనను సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్ సహా పలువురు మంత్రులు మే 10న వేర్వేరు ఫేస్‌బుక్ పోస్టులలో ఖండించారు.
ఇక ఈ కేసుకు సంబంధించి నిందితుడు వాంగ్.ప్రీ ట్రయల్ అక్టోబర్ 8న జరుగుతుంది.
జాతి విద్వేషపూరిత దాడిలో అతని నేరం రుజువైతే వాంగ్‌కు 4.5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 7,500 సింగపూర్ డాలర్ల జరిమానా విధించే అవకాశం వుంది.
బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ… స్వీట్ బ్రదర్ అంటూ ఫిదా అయిన బన్నీ!