తెలుగు బాష విదేశాలలో దేదీప్యమానంగా వెలుగుతోందంటే, అక్కడి తెలుగు భవిష్యత్తు వారసులు తెలుగు ను చక్కగా పలుకుతున్నారంటే, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం, అక్కడ తెలుగు బాషకు సిలికానాంధ్రానే అని తడుముకోకుండా చెప్పవచ్చు.మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగును ఇప్పటి వారికి నేర్పేలా, ఓ వారధిలా సిలికానాంధ్రా తన విశేష కృషిని అందిస్తోంది.2001 లో అమెరికాలో ప్రారంభమైన సిలికానాంధ్రా కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన సాంస్కృతిగా సంస్థగా ఎదిగింది.
సిలికానాంధ్రా చేసిన విశేష కృషికిగాను ఇప్పటి వరకూ దాదాపు 8 గిన్నిస్ రికార్డులు సాధించిన ఏకైక సాంస్కృతిక సంస్థగా విశేష గౌరవాన్ని సాధించింది.
సిలికానాంధ్రా తన సేవలలో భాగంగా ఏర్పాటు చేసిన సిలికానాంధ్రా యూనివర్సిటీకి అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీ లకు అందించే WASC గుర్తింపు లభించింది.ఈ యూనివర్సిటీ ద్వారా తెలుగు బాష, సంస్కృతం నేర్పడం అలాగే ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ లో అన్ని కళలను నేర్పించే కోర్సులు ప్రవేశ పెట్టింది.అంతేకాదు
సంగీతానికి సంభందించిన కోర్సులను కూడా సిలికానాంధ్రా యూనివర్సిటీ అందిస్తోంది.అయితే తాజాగా సిలికానాంధ్రా మరో మైలు రాయి దాటింది.
తెలుగు బాషాభివ్రుద్ది కోసం చేస్తున్న కృషికి తగ్గట్టుగా తెలుగులో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (MA) చేసిందుకు అనుమతులు సంపాదించింది.ఈ మేరకు యూనివర్సిటీ నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికాలో గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయంలో తెలుగు బాషలో MA కోర్సు ప్రవాస భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదని సిలికానాంధ్రా ఈ ఘనత సాధించిందని అలాగే ఈ కోర్సులతో పాటు భారత నాట్యం, కూచిపూడి, కర్నాటక సంగీతంలో కూడా MA కోర్సు అందిస్తున్నామని తెలిపింది.తెలుగు లో MA కోర్సు చేసేందుకు సిలికానాంధ్రా కు అనుమతులు రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రవాస తెలుగు సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.