కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ( Congress party ) భారీ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్( DK Sivakumar ) నీ నియమిస్తూ కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి.కాంగ్రెస్ మిత్రపక్షాలను కొత్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
దీనిలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే( President Mallikarjuna Kharge ), సిద్ధరామయ్య గురువారం ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది.
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే.దీంతో తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.ఇదే సమయంలో ఎన్ సీపీ అధినేత శరత్ పవర్ ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
శనివారం బెంగళూరులో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.