మామూలుగా మనుషులకు మార్పు అనేది సహజం.పరిస్థితులు బట్టి జనాలు మారుతూ ఉంటారు.
అలా సామాన్యులే కాదు ఒక హోదాలో ఉన్న వ్యక్తులు, సెలబ్రెటీలు కూడా పరిస్థితులు బట్టి మారుతూ ఉంటారు.అయితే కొన్ని రోజుల నుండి అనసూయ( Anasuya ) కూడా మార్పు వచ్చిందని తెలుస్తుంది.
ఇక ఆ మార్పు ఎటువంటిదో ఇప్పుడు చూద్దాం.
అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
జబర్దస్త్ లో యాంకర్ గా( Jabardasth Anchor ) ఓ రేంజ్ లో సందడి చేసింది.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వయసుతో పాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది.
కెరీర్ మొదట్లో టీవీ న్యూస్ ఛానల్ లో పనిచేసిన అనసూయ ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.కానీ అంతగా గుర్తింపు ఉన్న నటిగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయింది.

ఇక ఎప్పుడైతే జబర్దస్త్ యాంకర్ గా అడుగుపెట్టిందో.అప్పటినుంచి అనసూయ తలరాత మొత్తం మారిపోయింది అని చెప్పాలి.తనేంటో అనేది టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.ఇక జబర్దస్త్ లో ఉండగానే వెండితెరపై ఆమెకు సినిమాలలో అవకాశాలు వచ్చాయి.దీంతో ఈసారి వెండితెరపై సరైన గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు అందుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది.
పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది.గత ఏడాది విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్ప లో( Pushpa ) నెగిటివ్ పాత్రలో కనిపించి బాగా అదరగొట్టేసింది.
ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెరపై బాగా బిజీగా మారింది.చేతినిండా ప్రాజెక్టులతో బాగా హవా క్రియేట్ చేసుకుంది.సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.

కాస్త బ్రేక్ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి బాగా హల్చల్ చేస్తుంది.ముఖ్యంగా తన ఫోటోషూట్లతో కుర్రాలను కన్నార్పకుండా చేస్తుంది.ఈ వయసులో కూడా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
ఇక ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే మాత్రం అసలు ఊరుకోదు అనసూయ.ఆ సమయంలో ఫైర్ బాంబ్ అయిపోతుంది అని చెప్పాలి.
ఇక ఈమధ్య మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం జిమ్ములో తెగ కష్టపడుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే గత కొన్ని రోజుల నుండి అనసూయలో ఒక కొత్త మార్పు కనిపిస్తుందని చెప్పాలి.
అదేంటంటే ఈమధ్య తన మెడలో ఎక్కువగా జపమాల కనిపిస్తుంది.ఇప్పటికే టాలీవుడ్ లో సాయి పల్లవి జపమాల ధరిస్తూ అందరికీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.
సమంత కూడా శాకుంతలం సినిమా సమయంలో జపపాల ధరిస్తూ కనిపించింది.

ఇక మరో హీరోయిన్ పూనమ్ బజ్వా కూడా జపమాల ధరిస్తూ కనిపించింది.అయితే తాజాగా అనసూయ కూడా జపమాల ధరించడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.అనసూయలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని అందరూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.
ప్రస్తుతం ఆమె జపమాల ధరించిన ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి
.






