కెరీర్ పరంగా సాధించిన లక్ష్యాన్ని ఒక్క మార్కు వల్ల కోల్పోయిన సమయంలో కలిగే బాధ అంతాఇంతా కాదు.కొంతమంది ఒకసారి ఫెయిల్యూర్ ఎదురైతే తమకు ఎప్పటికీ సక్సెస్ దక్కదని భావించి మరోసారి ప్రయత్నం చేయడానికి కూడా ఆసక్తి చూపరు.
మరి కొందరు మాత్రం లక్ష్యం ఎంత పెద్దదైనా తమ టాలెంట్ తో ఆ లక్ష్యాన్ని సులువుగా సాధించడంతో పాటు విమర్శించిన వాళ్ల నోర్లు మూయిస్తుంటారు.అపజయాన్ని విజయంగా మార్చుకున్న ఎస్సై దీపక్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
కొన్నేళ్ల క్రితం దీపక్( deepak ) ఎస్సై జాబ్ సాధించాలని తన ప్రయాణన్ని మొదలుపెట్టగా తొలి ప్రయత్నంలో ఫెయిల్యూర్ ఎదురైనా ఎంతో కష్టపడి రెండో ప్రయత్నంలో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ఆశించిన కొలువును సాధించిన దీపక్ ప్రశంసలు అందుకుంటున్నారు.
సిరిసిల్ల ( Sircilla )ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా దీపక్ పని చేసిన దీపక్ ఇప్పుడు ఎస్సై లక్ష్యాన్ని సాధించారు.
బాల్యం నుంచి చదువు, ఆటల్లో దీపక్ ముందువరసలో ఉండేవారు.దీపక్ తల్లి గృహిణి కాగా తండ్రి మెకానిక్ గా పని చేసేవారు.మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన దీపక్ ఎస్సై కొలువు కోసం ప్రయత్నించిన సమయంలో ఒక్క మార్కుతో చేదు ఫలితం ఎదురైంది.
అయితే నిరాశ చెందకుండా తొలి ప్రయత్నంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా దీపక్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
రెండో ప్రయత్నంలో మరింత పట్టుదలతో శ్రద్ధగా చదివిన దీపక్ ఈసారి సక్సెస్ సాధించడంతో పాటు సివిల్ ఎస్సై అయ్యారు.చిన్న బాబాయి శంకర్ ( Shankar )ప్రోత్సాహం వల్లే తాను పోలీస్ కావాలని భావించానని తాను లక్ష్యాన్ని సాధించడం కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు.దీపక్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
దీపక్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.