అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాడని అక్కినేని ఫ్యామిలీలో నంబర్ వన్ హీరో అవుతాడని అందరూ భావించారు.అయితే అఖిల్ మాత్రం తన నటనతో మెప్పిస్తూ ప్రేక్షకులకు మాత్రం దగ్గర కావట్లేదు.
ఏజెంట్( Agent ) సినిమాకు సింగిల్ డిజిట్ కలెక్షన్లు నమోదవుతున్నాయంటే ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అఖిల్ ఏజెంట్ సినిమా విషయంలో జోక్యం చేసుకున్నాడని రీషూట్ల వల్లే ఈ సినిమా కంగాళీగా తయారైందని ప్రచారం జరుగుతున్న తరుణంలో నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా రిజల్ట్ కు తామే కారణమని చెప్పారు.అఖిల్ గత సినిమాలను మించిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో జరిగాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏజెంట్ మూవీలో హీరోయిన్ గా నటించిన సాక్షి వైద్య గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు.
ఏ హీరోయిన్ అయినా అఖిల్ తో నటిస్తే ఆ హీరోయిన్ కెరీర్ పుంజుకోవడం లేదు.అఖిల్ తొలి సినిమాలో సయేష్ సైగల్, రెండో సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్( Kalyani Priyadarshan ), మూడో సినిమాలో నిధి అగర్వాల్, నాలుగో సినిమాలో పూజా హెగ్డే( Pooja Hegde ) ఐదో మూవీలో సాక్షి వైద్య నటించారు.
అయితే ఈ హీరోయిన్లు ఎవరూ ప్రస్తుతం వరుస ఆఫర్లతో లేరు.హీరోయిన్లకు సంబంధించి అఖిల్ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఏజెంట్ ఫెయిల్యూర్ విషయంలో అఖిల్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.ఈ సినిమా ఫలితం గురించి స్పందించడానికి ఆయన ఇష్టపడటం లేదు.ఏజెంట్ సినిమా నష్టాలను తర్వాత సినిమాల ద్వారా భర్తీ చేస్తానని అనిల్ సుంకర మాటిచ్చారు.ఏజెంట్ ఫెయిల్యూర్ తో అఖిల్ ఇకనైనా కథల ఎంపికలో మారతారేమో చూడాలి.
అఖిల్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లను ఫ్యాన్స్ మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు.