దొరసాని ఈసారైనా సక్సెస్ అయ్యేనా.. స్టార్ కిడ్‌ సినిమా కష్టాలు

టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరో గా కొనసాగిన యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఇద్దరు కుమార్తె లు హీరోయిన్స్ గా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం అయిన విషయం తెలిసిందే.వీరిద్దరి లో శివాత్మిక రాజశేఖర్ దొరసాని సినిమా తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది.

 Shivathmika Rajashekhar Movie Akasham Ready To Release , Akasham Movie, Flim Ne-TeluguStop.com

మొదటి సినిమా తోనే నటి గా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.ఈమె గ్లామర్ షో చేసేందుకు కూడా ఓకే చెబుతున్నప్పటికీ టాలీవుడ్ నుండి పెద్దగా మద్దతు కనిపించడం లేదు.

తెలుగు లో తెలుగు హీరోయిన్స్ కి ఎక్కువ గా ప్రోత్సాహం ఉండదని మరో సారి శివాత్మిక రాజశేఖర్ ని చూస్తుంటే అర్థమవుతుంది.అందం మరియు ప్రతిభ ఉన్నప్పటికీ పాపం శివాత్మిక రాజశేఖర్ కి అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నాయి.

Telugu Akasham, Rajashekhar, Shivani, Shivathmika, Telugu, Tollywood-Movie

తాజాగా ఆకాశం అనే సినిమా లో అశోక్ సెల్వన్ కి జోడి గా నటించింది.ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శివాత్మిక రాజశేఖర్ పాల్గొంటున్నారు.ఈ సినిమా కోసం ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించినట్లుగా ఇటీవల విడుదలైన ఒక పాట ను చూస్తుంటే అర్థమవుతుంది.ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ ఈమె కు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాపం ఈ స్టార్ కిడ్ కి ఈ సినిమా తో అయినా సక్సెస్ దక్కి.కమర్షియల్ గా బ్రేక్ వచ్చి.వరుసగా ఆఫర్స్ దక్కేనో చూడాలి.ఈమె సక్సెస్ దక్కించుకుంటే సోదరి శివాని కూడా ముందు ముందు రొమాంటిక్ సన్నివేశాల్లో లేదా మొద్దు సీన్స్ లో నటించి పాపులారిటీ పెంచుకునే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆకాశం సినిమా పై శివాత్మిక పెట్టుకున్న ఆవలు నిలిచేనా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube