Munugodu Komatireddy Rajagopal Reddy : మునుగోడు లో మొదలుకానున్న బ్రదర్స్ రాజకీయం ?

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా , కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండేవారు.

 The Politics Of Brothers That Will Start In Munugodu , Munugodu Asembly Electio-TeluguStop.com

ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.అన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతుండగా,  రాజగోపాల్ రెడ్డి బిజెపి తరఫున అభ్యర్థిగా పోటీకి దిగడం,  బ్రదర్స్ ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో తమ్ముడు ఓటమికి అన్న పని చేస్తారని అంతా అంచనా వేశారు.

దీనికి తగ్గట్లుగానే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా వెంకటరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.అయితే తమ్ముడి విషయంలో పార్టీని సైతం పక్కనపెట్టి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ఇక్కడ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు, తెలంగాణ సీనియర్ నాయకుల నుంచి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో వెంకటరెడ్డి కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్ళిపోయారు.

 దీంతో తమ్ముడు విజయానికి పరోక్షంగా సహకరించేందుకు వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లారని , ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన తిరిగి వస్తారని అంతా భావించగా , వెంకటరెడ్డి మాత్రం పోలింగ్ కు ముందే విదేశాల నుంచి తిరిగి వచ్చేసారు.

మొదట్లో బిజెపి అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ధీమాతో ఉన్నా.టిఆర్ఎస్ పగడ్బందీగా రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం,  అన్ని విషయాల్లోనూ ఇరుకుని పెట్టే విధంగా ప్రయత్నిస్తుండడంతో పాటు, డబ్బు పంపిణీ జరగకుండా పగడ్బందీగా పోలీసుల ద్వారా నిఘా ఏర్పాటు చేయడం , పెద్ద ఎత్తున బిజెపి నుంచి టిఆర్ఎస్ లోకి చేరికలను ప్రోత్సహించే విధంగా ప్రయత్నిస్తూ ఉండడం, అలాగే బిజెపి నుంచి కీలకమైన నాయకులను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం, అలాగే బీజేపీ లోనే ఉంటూ టిఆర్ఎస్ కు సహకరించే విధంగా కొంతమంది నాయకులతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు పై అనేక అనుమానాలు నెలకొన్న క్రమంలోనే ఆకస్మాత్తుగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చారు.
   

Telugu Komati Brothers, Komatirajagopal, Komati Venkata, Revanth Reddy, Telangan

పోల్ మేనేజ్మెంట్ లో ఆరి తేరిన వ్యక్తిగా వెంకటరెడ్డికి గుర్తింపు ఉంది.దీంతో బిజెపిలో ఉన్న తన సోదరుడి కోసం వెంకటరెడ్డి చక్రం తిప్పబోతున్నట్లు సమాచారం.అలాగే నల్గొండ రాజకీయాల్లో వెంకటరెడ్డికి బాగా పట్టుంది .ప్రతి గ్రామం మండలంలోని నాయకులంతా బాగా పరిచయం ఉన్నవారు కావడంతో,  కాంగ్రెస్ లోనే ఉంటూ బిజెపి అభ్యర్థిగా ఉన్న తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సహకరించాల్సిందిగా వెంకటరెడ్డి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని,  పోలింగ్ తేదీలోపు రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా రాజకీయం మార్చాలన్న ఆలోచనతో వెంకటరెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube