అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక రాజధానిగా ఉంచడానికి రైతుల దీక్షకు మద్దతుగా యునైటెడ్ స్టేట్స్ లోని ఎన్.ఆర్.ఐ.

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా అమెరికాలో న్యూజెర్సీ లోని ప్రవాసాంధ్రులు “న్యూజెర్సీ అమరావతి పరిరక్షణ JAC” తరుపున NATS మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ 7,76,022.00 రూపాయిల చెక్ ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు అందచేశారు.

 Shivareddy Pravasandhrulu Amaravati-TeluguStop.com

అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ ఆరే.శివారెడ్డి, జనరల్ సెక్రటరీ గద్దె తిరుపతిరావు, అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, సోషల్ మీడియా విభాగాధిపతి పి.కిరణ్ హాజరై ఈ చెక్ ను అందుకున్నారు.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు అమరావతి పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, న్యూజెర్సీ లోని ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలియజేసారు.

Telugu Amaravati, Amaravatiandhra, Andhra Pradesh, Telugu Nri Ups-

ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ, ప్రతాప్ చింతపల్లి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరూ అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధాని గా కొనసాగి విధంగా జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయాలని అదేవిధంగా న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తూ భవిష్యత్తులో ఒక రాజధాని ఒక రాష్ట్రం పోరాటానికి మా ప్రవాసాంద్రులు అందరూ కూడా అన్ని రకాలుగా మీ వెన్నంటి ఉంటామని తెలియజేయడమైనది.ఇంకా ఈ కార్యక్రమంలో కొసరాజు విజయబాబు, చింతపల్లి ప్రవీణ్, రవి మొదలైన వారు న్యూజెర్సీ అమరావతి JAC తరుపున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube