తాజాగా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ ( One Day World Cup ) షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే.2023 అక్టోబర్ 5న ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం ఉంది.వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ తో సహా మొత్తం 48 మ్యాచులు 10 జట్ల మధ్య జరగనున్నాయి.అయితే కొంతమంది మాజీ క్రికెట్ నిపుణులు ముందుగానే సెమీఫైనల్ కు చేరే నాలుగు జట్లు ఏవో ముందుగానే అంచనా వేశారు.
ఆ వివరాలు ఏమిటో చూద్దాం.
భారత జట్టు ఆల్ రౌండర్ దినేష్ కార్తీక్( Dinesh Karthik ) అంచనాల ప్రకారం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరుతాయని చెప్పాడు.
అయితే గతంలో 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య హోరాహోరీగా జరిగింది.చివరికి సూపర్ ఓవర్ ద్వారా ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది.
ఈ ఏడాది కూడా ఇంగ్లాండ్ తో పాటు పాకిస్తాన్ లేదా దక్షిణాఫ్రికా కూడా సెమీఫైనల్ చేరే అవకాశం ఉందని దినేష్ కార్తీక్ అంచనా వేశాడు.

భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్( Virendra Sehwag ) కూడా సెమీఫైనల్ కు చేరే జట్లు ఏవో అంచనా వేశాడు.ఇతని అభిప్రాయం ప్రకారం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉంది.ఇక ఫైనల్ మ్యాచ్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే అవకాశం ఉండవచ్చని వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
శ్రీలంక మాజీ ప్లేయర్ మురళీధరన్ కూడా సెమీ ఫైనల్ కు చేరే జట్లు ఏవో ముందుగానే అంచనా వేశాడు.

ఇతని అభిప్రాయం ప్రకారం భారత్, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్ కు చేరే అవకాశం ఉందని తెలిపాడు.ఇతని అంచనా ప్రకారం ఫైనల్ మ్యాచ్ భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరిగే అవకాశం ఉంది.అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ మాజీ క్రికెట్ నిపుణులు అంచనాలు ఒకేలా ఉన్నాయి.
ఇక భారత్ మొదటి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియా తో జరగనుంది.