తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి జయమాలిని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ తరం పేక్షకులకు జయమాలిని గురించి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం వారు మాత్రం జయమాలిని అంటే చాలు ప్రతి ఒక్కరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు.
అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన స్పెషల్ సాంగ్ లలో చిందులు వేసింది.అంతేకాకుండా అప్పట్లో బాగా క్రేజ్ ఉన్న వారిలో ఈమె కూడా ఒకరు.
తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ భాషల్లో కూడా భారీగా క్రేజ్ ను సంపాదించుకుంది.ఈమె డాన్సర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకుంది.
అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు డాన్సర్ గా ఒక వెలుగు వెలిగింది.అంతేకాకుండా తన అందంతో అప్పట్లోనే ఉర్రుతలూగించింది.
ఇకపోతే ప్రస్తుతం ఈమె చెన్నైలో నివసిస్తోంది.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రపోజ్ చేశారు.
పట్టు నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి.చాలామంది పెళ్లి చేసుకుంటాను అని వెంటపడ్డారు.
ఇంకా అప్పట్లో నాకు వచ్చే లవ్ లెటర్స్ చూడడం కోసం ప్రత్యేకంగా ఒక మేనేజర్ కూడా ఉండేవారు.కొందరు ప్రేమలేఖలు రక్తంతో రాసి పంపేవారు.అలా ఒక మిలిటరీ ఆఫీసర్ కూడా నాకు లవ్ లెటర్ రాశారు.పెళ్లి గురించి మా అమ్మ నాన్నతో కూడా మాట్లాడతా అన్నారు.కొందరు మా అమ్మ వాళ్లను అడిగే ధైర్యం లేక మా అక్క జ్యోతిలక్ష్మి తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు అని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంది జయమాలిని.మన వెంట అంతమంది పడితే దాన్ని మాత్రం ఒక స్టార్ హీరోని ప్రేమించాను అంటూ తన లవ్ సీక్రెట్ ని బయటపెట్టింది.
తాను ఒక స్టార్ హీరోని ప్రేమించానని ఆయన కూడా తనను ప్రేమించారని, కానీ ఇద్దరు బయటపడలేదు.
మొదట ఆయన లవ్ చేశారు అని తెలిపింది జయమాలిని. ఒకరోజు రాత్రి షూటింగ్ జరుగుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చి చెప్పాలని చూసారు ధైర్యం లేక గొంతు సవరించి చెప్పకుండా వెళ్ళిపోయారు.నేను కూడా నాకు ధైర్యం లేక ఈ విషయం ఆయనకు ఇప్పటివరకు చెప్పలేదు.
నాది నిజమైన ప్రేమ నాకు వయసు వచ్చి చనిపోయేలోపు నేను ఆ విషయాన్ని ఆ హీరోని కలిసి చెబుతాను అని తెలిపింది జయమాలిని.ఆ స్టార్ హీరో ఇప్పటికే బతికే ఉన్నారు ఆయనకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చింది.