బాహుబలి సీన్ రిపీట్ చేసిన సీతక్క !

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సాధారణంగా గవర్నర్ నివాసంలో ఉంటుంది.అయితే ఇంతకుముందు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ మరియు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి సృష్టించిన ట్రెండును ఫాలో అయిన రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎల్బి స్టేడియంలో భారీ జన సందోహం నడుమ ప్రమాణ స్వీకారం చేశారు అశేషంగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మధ్య రేవంత్ ప్రమాణస్వీకారం నభూతో అన్న రీతిలో సాగింది ముఖ్యంగా అనుముల రేవంత్ రెడ్డి అనే నేను అన్న మాటలు వినిపించగానే ఎల్బీ స్టేడియం మొత్తం భారీ నినాదాలతో హోరెత్తిపోయింది .

 Seethakka Repeated The Baahubali Scene, Ntr , Seethakka ,revanth Reddy , Ts Po-TeluguStop.com

సూటిగా స్పష్టంగా ప్రమాణ స్వీకారం పూర్తిచేసుకున్న రేవంత్ జై తెలంగాణ జై సోనియమ్మ అంటూ తన ప్రమాణ స్వీకరణ ప్రారంభించడం గమనార్హం .రేవంత్ తర్వాత ప్రజల నుంచి ఆ స్థాయిలో మద్దతు దక్కించుకున్నది మాత్రం మొదటిసారి మంత్రి పదవి దక్కించుకున్న సీతక్కగానే చెప్పాలి.

Telugu Chandra Babu, Congress, Revanth Reddy, Seethakka, Ts-Latest News - Telugu

రేవంత్ కొలువులో గిరిజన సంక్షేమ శాఖ దక్కించుకున్న సీతక్క( Seethakka ) తన ప్రమాణ స్వీకారం ప్రారంభించగానే ఎల్బీ స్టేడియం నుంచి భారీ మద్దతును దక్కించుకున్నారు.కొన్ని నిమిషాల పాటు స్టేడియం మొత్తం హోరు ఎత్తిపోయింది అంటే అతిశయోక్తి కాదు.ఆమెకు ఆ స్తాయిలో దక్కిన మద్దతుకు స్టేడియం లో కూర్చున్న గవర్నర్ కూడా కొంత ఆశ్చర్యానికి లోనయ్యారు అనే చెప్పాలి .

Telugu Chandra Babu, Congress, Revanth Reddy, Seethakka, Ts-Latest News - Telugu

నక్సలైట్ నుంచి మంత్రి పదవి దాకా సేతక్క ది చాలా విలక్షణమైన ప్రయాణమనే చెప్పాలి.14 సంవత్సరాల వయసులో అడవి బాట పట్టిన సీతక్క అనేక సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్( NTR ) ఇచ్చిన పిలుపుతో జనజీవన స్రవంతిలో కలిసిపోయి లాయర్ చదువు పూర్తి చేసుకున్నారు .తర్వాత అనేక ప్రజా ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించడంతో చంద్రబాబు ఆమెకు మొదటిసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.అప్పటినుంచి ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న సీతక్కకు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆమె ఇదే అభిమానాన్ని కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో మొదటి దళిత ముఖ్యమంత్రిగా చోటుదగ్గించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని చాలా మంది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube