ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని భయపెట్టే ప్రాణాంతక వ్యాధి కేన్సర్.పలు రకాల కేన్సర్‌లు ఎంతో మందిని ఏటా బలితీసుకుంటున్నాయి.
నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు కేన్సర్ బారిన పడుతున్నట్లు నివేదికలు వెల్లడి చేస్తున్నాయి.కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే మందు ఇంత వరకు రాలేదు.
లేజర్ ట్రీట్‌మెంట్ వంటికి కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.ఈ తరుణంలో మొదటిసారిగా యూఎస్‌లోని మాన్‌హట్టన్ మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో రోగులలో 100% క్యాన్సర్‌ను నిర్మూలించే డ్రగ్ ట్రయల్ విజయవంతం అయింది.
ఇది కేన్సర్ రోగుల్లో సరికొత్త ఆశలను చిగురింప జేసింది.ఇది వినియోగంలోకి రాగానే ఎంతో మంది కేన్సర్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది.
కేన్సర్ చికిత్సలో సుదీర్ఘమైన, బాధాకరమైన కీమోథెరపీ సెషన్‌లు, శస్త్రచికిత్సల ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించగలదని ఆశలు ఈ కొత్త మందు తెచ్చిపెట్టింది.18 మంది కేన్సర్ బాధితులకు ఈ మందును ఇవ్వగా వారికి పూర్తిగా నయం చేసింది.రోగులకు డోస్టార్‌లిమాబ్ ఔషధాన్ని ఇవ్వగా అది వారందరిలో కేన్సర్ కణాలన్నింటినీ ఆరోగ్యంగా మార్చింది.ఇది చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.పలు రకాల ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ ద్వారా వ్యాధి కోసం పరీక్షిస్తే వారు పూర్తిగా కోలుకున్నట్లు తేలింది.ఈ డ్రగ్ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆశను కలిగించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2020లో దాదాపు 10 మిలియన్ల మంది కేన్సర్ బారిన పడి మరణించారు.ఇది దాదాపు ఆరుగురిలో ఒకరి మరణానికి క్యాన్సర్ కారణమైంది.