సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చూసినప్పుడు అంత పెద్ద గా నచ్చదు కానీ ఆ సినిమా చూస్తున్న కొద్ది ఆ సినిమాలో ఉన్న డెప్త్ అనేది మనకు అర్థం అవుతూ ఉంటుంది.ఇక అలాంటి సినిమానే అర్జున్ రెడ్డి ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బోల్డ్ సినిమా లాగా అనిపించింది.
అయినప్పటికీ ఆ తర్వాత ఆ సినిమా కల్ట్ క్లాసికల్ గా మిగిలిపోయింది.ఇక అలాంటి ఒక సినిమాని మనకందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తనదైన రీతిలో ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే ఇప్పుడు ఆయన చేసిన అనిమల్ సినిమాలో( Animal Movie ) మొదట హీరోగా రణ్బీర్ కపూర్( Ranbir Kapoor ) కాకుండా వేరే ఒక బాలీవుడ్ హీరోని అనుకున్నారంట కానీ ఆయన ఈ సినిమాకి కొంచెం నెగిటివ్ గా స్పందించడంతో ఈ సినిమాని రన్బీర్ కపూర్ దగ్గరికి తీసుకెళ్లాడు సందీప్…
స్టోరీ విన్న వెంటనే రన్బీర్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక దాంతో ఈ సినిమా పట్టాలెక్కింది.ఇక డిసెంబర్ 1 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 800 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది.ఈ సక్సెస్ అనేది బాలీవుడ్ కి( Bollywood ) ఒక శుభపరిణామం అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు బాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లు రావడం లేదు.
దాంతో బాలీవుడ్ కి అర్జెంటుగా ఒక సక్సెస్ అయితే అవసరం పడింది.అందుకే ఈ సినిమా అనేది సక్సెస్ అయి బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా టాపికే నడుస్తుంది…ఇక ఇప్పుడు ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
.