స్పోర్ట్స్ మ్యాచ్‌లపై అభిమానులు సరదాగా, లేదంటే డబ్బులకు పందేలు వేయడం కామన్.అయితే భారీగా పందెం కాసి ఓడిపోతే చాలా డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది.
ఈ సమయం కోపం, బాధ తీవ్రంగా కలుగుతుంది.వాటిని కంట్రోల్ చేసుకోకపోతే చాలా కష్టం ఇటీవల ఒక వ్యక్తి ఒక స్పోర్ట్స్ మ్యాచ్‌లో పందెం కాసి అక్షరాలా రూ.16 లక్షలు నష్టపోయాడు.ఆ బాధలో కోపంలో అతడు విలువైన టీవీని( TV ) చేతితో గుద్దుతూ పగలగొట్టాడు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అది చూసి చాలా మంది షాక్ అవుతారు.
వివరాల్లోకి వెళితే, రీసెంట్‌గా కాన్సాస్ సిటీ చీఫ్స్,( Kansas City Chiefs ) శాన్ ఫ్రాన్సిస్కో 49ers( San Francisco 49ers ) టీమ్స్ మధ్య సూపర్ బౌల్ 2024( Super Bowl 2024 ) అనే ఒక థ్రిల్లింగ్ గేమ్ జరిగింది.
అయితే చీఫ్స్ జట్టు గేమ్‌లో గెలిచి వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా గెలిచింది.దాంతో ఓడిపోయిన 49ers ఫ్యాన్స్ చాలా విచారంగా, కోపంగా ఉన్నారు, ఎందుకంటే వారి జట్టు ఎక్కువ సమయం ఆధిక్యంలో ఉన్న తర్వాత ఆటను కోల్పోయింది.
కొంతమంది అభిమానులు గేమ్‌పై పందెం( Betting ) కాశారు, వారందరూ కూడా డబ్బు నష్టపోయారు.ఒక యువకుడు 49ers టీమ్ పై ఏకంగా 20,000 డాలర్లు పందెం వేశాడు.అయితే అది ఓడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు.అంతే, టీవీని పిడికిలితో ధ్వంసం చేశాడు.దీనికి సంబంధించిన వీడియో వార్తలు అయ్యింది.పగిలిన టీవీని పేపర్ టవల్ తో శుభ్రం చేసేందుకు ఓ మహిళ ప్రయత్నించిన దృశ్యం కూడా ఆ వీడియోలో ఉంది.
సదరు 49ers అభిమాని బెట్టింగ్ గెలిచిన వ్యక్తిని తన ఇంటి నుంచి బయటకు కూడా తోసేసాడు.
ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో ఫిబ్రవరి 12న ఆ వీడియో పోస్ట్ చేయగా దానికి చాలా వ్యూస్ వచ్చాయి.49ers అభిమాని ప్రవర్తన చూసి కొందరు షాక్ అయ్యారు, అతను చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నాడని అన్నారు.కొంతమంది ఆ వీడియో ఫేక్ అని భావించి అతను బ్యాడ్ యాక్టర్ అని పేర్కొన్నారు.
కోపం వల్ల నష్టం జరుగుతుందే తప్ప మంచి జరగదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని మరి కొందరు అన్నారు.