టాలీవుడ్ మోస్ట్ గ్లామర్ బ్యూటీ సమంత గురించి, తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువేన్ననట్లుగా దూసుకుపోతుంది.ఇక తన అందంతో యువతను కన్నార్పకుండా చేస్తుంది.
సమంత పెళ్ళికి ముందు కంటే తన పెళ్లి తర్వాతనే మరింత మోడ్రన్ గా కనిపిస్తూ హార్ట్ లుక్ లతో ఫోటో షూట్లను చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది.
ప్రస్తుతం సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానంలో పేరు సంపాదించుకుంది.
వెండి తెరపై కాకుండా బుల్లితెర లో కూడా కొన్ని కార్యక్రమాల్లో చేసింది.ఇక సమంత ఎన్నో సినిమాలలో అవకాశాలను సొంతం చేసుకోగా.
ఆమె 2011 నుంచి 2018 వరకు ఓ రేంజ్ లో అవకాశాలను దక్కించుకుంది.ఈ సమయంలో ఎన్నో సినిమాలలో నటించిన సమంత దాదాపు 10 సినిమాలను రిజెక్ట్ చేసిందట.

తను ఆ సమయంలో మరో సినిమాలో బిజీగా ఉండగానే మరికొన్ని సినిమాల్లో అవకాశాలు రాగా తనకు డేట్ కుదరకపోవడం వల్ల, కొన్ని కథలు నచ్చక వల్ల వదులుకుంది.అందులో సమంత వదిలేసిన సినిమాలలో 8 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అవేంటో చూద్దాం.
మణిరత్నం దర్శకత్వంలో ‘కడలి‘ సినిమా లో అవకాశం రాగా డేట్స్ ఇచ్చి మరీ వదిలేసింది.
ఇక రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ఎవడు‘ సినిమా కు అవకాశం రాగా స్కిన్ ఎలర్జీ తో వదులుకుంది.అంతే కాకుండా మరో సినిమా ‘బ్రూస్లీ‘ సమయంలో మరో రెండు సినిమాలు ఉన్నందున ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయింది.
ఇక నాని నటించిన ‘నిన్ను కోరి‘ సినిమా లో కథ నచ్చ గా కొన్ని కారణాల వల్ల అవకాశాన్ని కోల్పోయింది.ఇక యూటర్న్ హిందీలో రీమేక్ గా రాగ ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదు.
ఎన్టీఆర్ కథానాయకుడు లో ఓ చిన్న పాత్ర కావడంతో ఆసక్తి చూపించలేదు.కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా లో అవకాశం రాగా తనకు బాలీవుడ్ సూట్ కాదని తప్పుకుంది.
ఇక అశ్విన్ శరవణన్ సినిమాలో పెళ్లి సందర్భంలో వచ్చినందున వదులుకుంది.ఇక పుష్ప సినిమాలో కూడా ఆఫర్ రాగా తప్పుకుంది.