గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏం మాయ చేసావే‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా సమంత( Samantha ) , తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.తన అద్భుతమైన నటనతో పాటుగా చూపులు తిప్పుకోలేని అందం తో కుర్రకారుల మతులను పోగొట్టింది.
ఆ సినిమా తర్వాత ఆమె ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాటుగా తమిళ స్టార్ హీరోలతో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంది.కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే కాకుండా తన మాజీ భర్త నాగ చైతన్య వయస్సు ఉన్న హీరోలతో కూడా వరుసగా సినిమాలు చేసింది.
అయితే ఎప్పుడైతే నాగ చైతన్య తో విడాకులు తీసుకుందో అప్పటి నుండి ఆమె లేడీ ఓరియెంటెడ్ రోల్స్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
మధ్యలో ఆమె ‘ది ఫ్యామిలీ మెన్( The Family Man Season 2 )’ వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో విలన్ రోల్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.అలా కెరీర్ ని విభిన్నంగా ప్లాన్ చేసుకున్న సమంత రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఖుషి‘ అనే చిత్రం లో కనిపించింది.ఈ సినిమాలో కూడా ఆమెకి నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది, కమర్షియల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇదంతా పక్కన పెడితే సమంత చాలా కాలం నుండి ‘మయోసిటిస్( Myositis )’ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సమంత చివరి శస్త్రచికిత్స కోసం రీసెంట్ గానే న్యూయార్క్ వెళ్ళింది.విజయవంతంగా ఆపరేషన్ ని చేయించుకుంది.
కానీ ఆమెకి ఒక ఏడాది పాటుగా డాక్టర్లు విశ్రాంతి అవసరం అని, షూటింగ్ లో వాడే లైట్స్ కి అసలు ఎదురు పడొద్దు అంటూ ప్రత్యేకంగా హెచ్చరించాడట.
దీంతో ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే సమంత అతి త్వరలోనే శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందట.ఇప్పటి వరకు ఆమె సంతకం చేసి అడ్వాన్స్ తీసుకున్న నిర్మాతలకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తోందట.
అంతే కాకుండా రీసెంట్ గానే ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ సమంత ని కలిసి ఒక స్టోరీ ని వినిపించగా, ఆమె వెంటనే నో చెప్పేసిందట.ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈమధ్య కాలం లో చాలా కథలనే ఆమె రిజెక్ట్ చేసిందట.
ఇదంతా చూస్తూ ఉంటే ఆమె ఇక సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారు అనే విషయం అర్థం అవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు.