ఇండస్ట్రీ ప్లే బాయ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి.. అసలేమైందంటే?

హీరోయిన్ సాయి పల్లవి( Heroine Sai Pallavi ) గురించి మనందరికీ తెలిసిందే.సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

 Sai Pallavi Upcoming Movie Star Hero, Sai Pallavi, Upcoming Movie, Kollywood, Sh-TeluguStop.com

ఆచి చూసి సినిమాలలో నటిస్తూ సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి.అందులో భాగంగానే తాజాగా ఆమె నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది.గ్లామర్ పాత్రలకు ఎక్స్పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటోంది సాయి పల్లవి.

Telugu Kollywood, Sai Pallavi, Shimbu-Movie

ఇటీవల శివకార్తికేయన్‌ ( Sivakarthikeyan )కు జంటగా అమరన్‌ ( Amaran )చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి.కాగా తాజాగా మరో కోలీవుడ్‌ చిత్రం కోసం సాయి పల్లవి పేరు వినిపిస్తోంది.అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది.శింబు( Simbu ) ఇప్పుడు నటుడు కమల్ హాసన్‌ హీరోగా మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు.ఈ చిత్రం జూన్‌ లో తెరపైకి రానుంది.

కాగా తాజాగా వరుసగా మూడు చిత్రాల్లో నటించడానికి శింబు సిద్ధం అవుతున్నారు.అందులో ఒకటి పార్కింగ్‌ చిత్రం ఫేమ్‌ రామ్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం.

Telugu Kollywood, Sai Pallavi, Shimbu-Movie

డాన్‌ పిక్చర్స్‌ పతాకం పై ఆకాశ్‌ భాస్కరన్‌( Akash Bhaskaran ) నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను ఇటీవల నటుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.అందులో శింబు చేతిలో ఉన్న పుస్తకంలో రక్తం మరకలు కలిగిన కత్తి ఉండడంతో ఇది యాక్షన్‌ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.అదే విధంగా మరో ముఖ్య పాత్రలో నటుడు సంతారం నటించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది.హాస్య నటుడిగా పరిచయం అయ్యి ఆ తరువాత కథానాయకుడిగా రాణిస్తున్న సంతారం ఈ చిత్రం ద్వారా మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ లేదా సాంగ్స్‌ ఉండటం సహజం.

కోలీవుడ్‌ ప్లే బాయ్‌ అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఆయనకు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube