మొసలికి చుక్కలు చూపించిన సాహు

నీటిలో మొసలికి తిరుగులేదు.నీటిలో ఉన్నప్పుడు ఎంత పెద్ద జంతువైనా మొసలి ముందు తల వంచాల్సిందే.

 Sahu Fight With Crocodile Crocodile, Viral Latest, News Viral, Social Media, Vi-TeluguStop.com

అదే మొసలి బలం.అలాంటి మొసలి నోటికి చిక్కి.ఓ బాలుడు ధైర్యంగా పోరాడి, ప్రాణాలతో బయటపడ్డాడు.ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో జరిగిన ఘటన అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది.కేంద్రపడా జిల్లా నేషనల్ పార్క్ సమీపంలో భితర్ కనికా అనే నది ఉంది.సమీపంలోని అరజా గ్రామానికి చెందిన కొందరు కుర్రాళ్లు సరదాగా నదిలో ఈత కొడదామని ఒడ్డుదాకా వెళ్లారు.

వాళ్ళు ఈత కొడుతుండగా 7 అడుగుల పొడవున్న మొసలి ప్రత్యక్షమైంది.ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, పద్నాలుగేళ్ల మైనర్ బాలుడు ఓం ప్రకాశ్ సాహోను ఈడ్చుకుని నీటిలోకి లాక్కేల్లింది.

నడుము వరకు నీటిలో మునిగిపోయిన సాహో మొదట ప్రాణ భయంతో కేకలు వేశాడు.ఒడ్డుపై ఉన్న మిగతా పిల్లల కేకలు విని చుట్టుపక్కల ఉన్నవారు నది వద్దకు చేరుకోగా, అప్పటికే సాహోను మొసలి తన నోట్లో బంధించింది.

కానీ సాహూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ మొసలితో ధైర్యంగా పోరాడాడు.ఒక్కసాగా ఎటాక్‌ చేసిన మొసలిపై బాలుడు కూడా మెరుపు దాడి చేశాడు.తనపై మీదపడ్డ మొసలి నుదిటిపై బలంగా పిడిగుద్దులు గుద్దాడు.అంతే బలంగా కంటిపైనా దాడి చేశాడు.

బాలుడి చేతి దెబ్బకు మొసలి పట్టు విడిచింది.దీంతో ఒడ్డుకు చేరుకున్న కుర్రాడి చేతికి, కాలికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.కాగా, నది ఉధృుతంగా ప్రవహిస్తుండడంతో నదిలోని మొసళ్లు ఒడ్డుకు చేరుకొని ఇలా ప్రజలమీద దాడులు చేస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు.

ఇందుకు నిదర్శనంగా నెల వ్యవధిలో ముగ్గురు చనిపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube