లైగర్ సినిమా కథకు ఆ సినిమా కథకు పోలికలు.. పూరీ జగన్నాథ్ ఏమంటారో?

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా మరో నెల రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాతో విజయం సాధించి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాల్సి ఉంది.

 Rumours Goes Viral About Liger Movie Details Here Goes Viral , Details Viral , L-TeluguStop.com

అయితే లైగర్ సినిమా కథకు అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కథకు దగ్గరి పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలు బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

హీరో, అతలి తల్లి పాత్రలు ఈ రెండు సినిమాలలో ప్రధాన పాత్రలు కావడం గమనార్హం.ఆ సినిమాలోలా ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్ ను టీజింగ్ చేసే సన్నివేశాలు అయితే ఉన్నాయని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు క్లారిటీ వచ్చిందనే సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే వైరల్ అవుతున్న మీమ్స్ గురించి పూరీ జగన్నాథ్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

మరోవైపు లైగర్ ట్రైలర్ బాగానే ఉన్నా మరీ కొత్తగా అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అటు పూరీ జగన్నాథ్ స్టైల్ ను ఇటు విజయ్ దేవరకొండ స్టైల్ ను మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.

కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో హిందీలో కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Dear Comrade, Liger, Rumours, Lover-Movie

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ కు కీలకమని చెప్పవచ్చు.విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube