రూల్స్ రంజన్ రివ్యూ అండ్ రేటింగ్!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) ఒకరు.అయితే తాజాగా ఈయన రూల్స్ రంజన్ ( Rules Ranjan) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కిరణ్ అబ్బవరం నేహా శెట్టి ( Neha Shetty ) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు రతినం కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది.వెన్నెల కిషోర్ హైపర్ ఆది, వైవా హర్ష వంటి తదితరులు నటించిన ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్స్ బాగానే ఆకట్టుకున్నాయి.మరి మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ గా జీవిస్తుంటాడు.జీవితంలో ఎదగాలనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్ గా బతికేస్తుంటాడు.సడెన్ గా అతనికి ముంబై కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ వెన్నెల కిషోర్ రూమ్లో ఈయన ఉంటారు.

అక్కడే తన చిన్ననాటి స్నేహితురాలు సన(నేహా శెట్టి) పరిచయం అవుతుంది.ఆమె కోసం రూల్స్ బ్రేక్ చేసి పబ్బులకు వెళ్తుంటాడు.మెల్లిగా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు.కానీ ఆమెకు ప్రేమ విషయాన్ని చెప్పకుండా ఉండడమే కాకుండా తనకు పెళ్లి ఫిక్స్ అయిందనే విషయం తెలియడంతో కథ మొత్తం కీలక మలుపు తిరుగుతుంది.

మరి మనోరంజన్ తన ప్రేమ విషయాన్ని సనకు చెప్పారా వీరిద్దరూ ప్రేమలో గెలిచారా అన్నది ఈ సినిమా కథ.

Telugu Kiran Abbavaram, Neha Shetty, Review, Ranjan, Tollywood, Vennela Kishor-M

నటీనటుల నటన:

ఈ సినిమాలో ఎంతో స్ట్రిక్ట్ గా నటించే మనోరంజన్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించారు.ఈ పాత్రకు ఈయన సరైన న్యాయం చేశారని తెలుస్తోంది.ఇక నేహా శెట్టి ( Neha Shetty ) పాత్రకు ఈ సినిమాలో పెద్దగా స్కోప్ లేదని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి.మిగతా సెలబ్రిటీలు అందరూ కూడా వారి పాత్రలకు అనుకూలంగా వారు న్యాయం చేశారు.

టెక్నికల్

: దర్శకుడు చాలా రొటీన్ కథను రాసుకున్నాడు.పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని ప్రేమించి అబ్బాయిలు పడ్డ ఇబ్బందులకు సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి.

ఫస్ట్ హాఫ్ చాలా బోర్ గా ఉంది ఆ సమయంలోనే వెన్నెల కిషోర్ పాత్ర రావడంతో కాస్త ఆసక్తికరంగా మారింది.అమ్రిష్ పాటల్లో ఒక్కటి మాత్రమే బాగుంది బిజీ ఎం పర్వాలేదు అనిపించింది.

దులీప్ కుమార్ ఎం.ఎస్ ఎడిటింగ్ చాలా దెబ్బ కొట్టేసింది.

Telugu Kiran Abbavaram, Neha Shetty, Review, Ranjan, Tollywood, Vennela Kishor-M

విశ్లేషణ:

రొటీన్ కథతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి ఆఫ్ చాలా బోరింగ్ అనిపించింది ఇక సెకండ్ ఆఫ్ కూడా కమెడియన్స్ వెన్నెల కిషోర్ హైపర్ ఆది వైవా హర్ష వంటి వారి కామెడీ వల్ల సినిమా నిలబడిందని చెప్పాలి.

ప్లస్ పాయింట్స్

: కామెడీ, అక్కడక్కడ ఆకట్టుకునే సన్నివేశాలు.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ బోరింగ్, మ్యూజిక్ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు, కథలు బలం లేదు

Telugu Kiran Abbavaram, Neha Shetty, Review, Ranjan, Tollywood, Vennela Kishor-M

బాటమ్ లైన్:

రొటీన్ కథతో వచ్చిన కిరణ్‌ అబ్బవరం.కామెడీని, ఎమోషన్ సీన్లను ఇరికించాడు.అందులో కామెడీ అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంటుంది.సినిమాలు కొత్తదనం లేదు.

రేటింగ్ 2/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube