నేడు సమాజంలో నిజాయితీగా డబ్బులు సంపాదించే వారే కరువైయ్యారు.జల్సాలు ఎక్కువై పోయాయి, ఇందుకు సరిపడ సంపాదన కరువైంది.
మరి యువత ఎలా సంపాదించుకుని ఎంజాయ్ చేస్తారంటే వీరు అడ్దదారులను ఎంచుకుంటున్నారు.
ఇక మోసం చేయాలంటే పెద్ద పెద్ద చదువులు అక్కరలేదు, చీట్ చేసేటన్ని తెలివితేటలుంటే చాలు.
ఇదిగో ఇలాంటి మార్గాన్నే ఎంచుకున్న ఓ వ్యక్తి తాను చదివింది పదో తరగతే అయినా ఎవడికి లేనన్ని తెలివి తేటలతో సంపన్నులను సైతం మోసం చేశాడు.ఆ వివరాలు చూస్తే.
వరంగల్ జిల్లా న్యూరాయ్ పూర్ కు చెందిన మీర్జా ఖాదర్ అలియాస్ సమర్ మీర్జాకు పెద్దగా చదువు అబ్బలేదు.ఈ క్రమంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి, మిస్టర్ బిల్డర్ రియల్ ఎస్టేట్ అండ్ కన్ స్ట్రక్షన్స్ పేరిట ఓ కంపెనీ ఏర్పాటు చేశాడు.30 మందిని ఉద్యోగులతో గచ్చిబౌలిలోని పీఎస్ఆర్ ప్రైమ్ టవర్స్ భవంతిలో ఓ ఫ్లోర్ అద్దెకు తీసుకుని, సదరు సంస్థకు తాను డైరెక్టర్ గా ప్రకటించుకున్నాడు.
తర్వాత ఆన్ లైన్ లో వ్యాపార, నిర్మాణల కోసం, వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు.
ఇలా రుణాల కోసం పలువురు అతన్ని ఆశ్రయించగా, వారి నుంచి కోట్లు దండుకున్నాడు.ఇలా 18 మంది నుండి సుమారుగా రూ.4.50 కోట్ల మేరకు వసూలు చేసినట్లుగా తెలిసింది.కాగా ప్రస్తుతం ఇతని మోసాలు వెలుగులోకి రాగా జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.