గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వడోదరాలో తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.మరో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ట్రక్కును ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.