అమెరికాలో బాలయ్య సినిమాలు ఆడలేదు.. తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాతలలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ బాలయ్య బాబుకు స్టార్ డమ్ పెరిగిందని అయితే అఖండ సినిమాకు ముందు బాలయ్య నటించిన కొన్ని సినిమాలు అమెరికాలో ఆడలేదని తమ్మారెడ్డి అన్నారు.

 Tammareddy Bharadwaj Shocking Comments Goes Viral In Social Media Details, Ameri-TeluguStop.com

అఖండ వరకు అమెరికాలో ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొన్నిసార్లు అమెరికాలో ఆయన సినిమాలు వేయలేదని అఖండ సినిమా అమెరికాలో సక్సెస్ సాధించిందని ఇప్పుడు చెన్నకేశవరెడ్డి అమెరికాలో రీరిలీజ్ కావడంతో పాటు మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఆయనకు అమెరికాలో విపరీతమైన మార్కెట్ పెరిగిందని ఇది విచిత్రం అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు.అన్ స్టాపబుల్ ద్వారా బాలయ్యకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిందా? లేక అఖండ నుంచి పెరిగిందా తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎందుకు పెరిగిందో తెలీదు కానీ మార్కెట్ మాత్రం బాగా పెరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Akhanda, America, Balakrishna, Balakrishna Usa, Suman, Tamma Bharadwaj, T

వెంకటేష్ తనకు నచ్చిన పాత్రలు చేయాలని అనుకుంటారని తమ్మారెడ్డి అన్నారు.వెంకటేష్ తనకు నచ్చిన సినిమాలు చేస్తారని ఆయన తెలిపారు.నెపోటిజంను నేను ఒప్పుకోనని చిరంజీవి, సుమన్, అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగారని ఆయన తెలిపారు.

Telugu Akhanda, America, Balakrishna, Balakrishna Usa, Suman, Tamma Bharadwaj, T

సుమన్ గారిని వేర్వేరు రీజన్ల వల్ల తొక్కేశారని ఆయన చెప్పుకొచ్చారు.అప్పట్లో మీడియా లేదు కాబట్టి సుమన్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన తెలిపారు.డబ్బులపై సినిమా రంగం ఆధారపడి ఉంటుందని ఈ రంగంలో ఒకరినొకరు తొక్కడం జరగదని ఆయన కామెంట్లు చేశారు.తమ్మారెడ్డి వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం డైరెక్షన్ కు, సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube