ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది.. మన ఇండియాలోనే.. ఎక్కడో తెలుసా..?

బంగారం( Gold ) అంటే ఇష్టపడనివారు ఎవరూ అసలు ఉండరు.భారతదేశంలో బంగారాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు.

 River In Jharkhand Where Gold Is Found Details, Atest News, India, Golden River,-TeluguStop.com

బంగారం ధరించేందుకు స్త్రీలతో పాటు పురుసులు కూడా ఆసక్తి చూపుతారు.అలాగే సేవింగ్స్ కింద కూడా బంగారాన్ని ఎక్కువమంది దాచుకుంటారు.

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.దీంతో బంగారాన్ని దాచుకోవడం వల్ల రేటు ఎక్కువ అయినప్పుడు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి.

అలాగే బంగారంలో పెట్టుబడి పెట్టేవారు కూడా చాలామంది ఉంటారు.బంగారంలో పెట్టుబడి పెడితే అధిక లాభంతో పాటు రిస్క్ తక్కువగా ఉంటుంది.

Telugu Golden River, India, Jharkhand, Jharkhandgold, Karkari, Latest, Odisha, P

అయితే భారతదేశంలో ఒక బంగారం నది( Gold River ) కూడా ఉంటుంది.ఈ రహస్య నది జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాలో ఉంది.జార్ఖండ్ నుంచి పశ్చిమబెంగాల్, ఒడిశాల మీదుగా ఈ నది ప్రవహిస్తుంది.ఈ నదిలో నీటితో పాటు బంగారం కూడా ప్రవహిస్తూ ఉంటుంది.రత్నగర్భ ప్రాంతంలో( Ratnagarbha Area ) ప్రవహిస్తున్న నదిలో స్వచ్చమైన బంగారం ఉందని చెబుతున్నారు.ఈ నదితో పాటు ఈ నదికి ఉపనదిగా ఉన్న కర్కారీలో( Karkari ) కూడా బంగారం లభిస్తుందట.

నదిలోని ఇసుక నుంచి భారీ మొత్తంలో బంగారం బయటపడుతుంది.

Telugu Golden River, India, Jharkhand, Jharkhandgold, Karkari, Latest, Odisha, P

474 కిలో మీటర్లు పొడవు ఉన్న ఈ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి( Ranchi ) 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఒడిశా, పశ్చిమబెంగాల్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.అయితే ఇలా బంగారం ప్రవహించే నది కెనడాలోని డాసన్ సిటీలో ఉంది.ఆ సిటీలో ప్రవహించే క్లోన్డికే నదిలో బంగారం కనుగొన్నారు.ఇండియాలో కూడా ఇలాంటి నది ఇప్పడు బయటపడింది.జార్ఖండ్ లో( Jharkhand ) మొదలయ్యే ఈ నదిలో స్థానిక గిరజన కార్మికులు ఇసుకను ఫిల్టర్ చేస్తూ నది గర్భం నుంచి బంగారాన్ని బయటకు తీయడంలో నిమగ్నమై ఉన్నారు.ఇప్పుడు ఈ బంగారపు నది విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube