గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఇటీవల ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం స్టే ఇచ్చింది.
అయితే గద్వాల ఎమ్మెల్యేగా కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయనపై అనర్హత వేటు వేసిన న్యాయస్థానం బీజేపీ నాయకురాలు డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.ఈ మేరకు ఎన్నికల సంఘం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.