ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమాను 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో తెరకెక్కించి తప్పు చేశారని ఈ సినిమా విషయంలో కామెంట్లు వ్యక్తమయ్యాయి.రాధేశ్యామ్ సినిమాకు ట్రైన్ సీన్, షిప్ సీన్ హైలెట్ అవుతాయని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.ఈ సినిమాలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
ఈ సినిమాకు 204 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించినా ఈ సినిమా షేర్ కలెక్షన్లు మాత్రం 90 కోట్ల రూపాయల లోపే ఉన్నాయి.రాధేశ్యామ్ సినిమా రిజల్ట్ విషయంలో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ టాలెంట్ కు రాధేశ్యామ్ రిజల్ట్ కు ఎక్కడా పొంతన లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.సాహో సినిమాతో సైతం ప్రభాస్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.
అయితే రాధేశ్యామ్ ఫ్లాప్ కావడానికి ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు కారణమని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.

రాధేశ్యామ్ సినిమాకు ముందు రిలీజైన ఒక పెద్ద సినిమా టికెట్ రేట్లను తగ్గించడం వల్ల హిట్ టాక్ వచ్చినా నష్టపోయింది.ఆ హీరో అభిమానులు రాధేశ్యామ్ సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.అదే సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ కు మధ్య వైరం ఉంది.