చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న సొంతింటి కలను నిజం చేస్తూ పటాన్ చెరు నియోజకవర్గ లబ్ధిదారులకు లాటరి ద్వారా ఎంపికచేసి సొంతింటి పట్టాలను అందించిన ఆర్డీవో నాగేష్, హౌసింగ్ అధికారులు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్ లో రామేశ్వరం బండ లోని జే ఎన్ ఎన్ ఆర్ యు ఎం 424 ఇళ్లను రామేశ్వరం బండ, పటాన్ చెరువు ,సికింద్రాబాద్ లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన ఆర్డిఓ నగేష్.
ఈ సందర్భంగా ఆర్డీవో నగేష్ మాట్లాడుతూ ఎంపిక చేసిన లబ్దిదారులకు కేటాయించిన ఇండ్లలో గృహప్రవేశ కార్యక్రమం అధికారికంగా నిర్వహించనుననట్లు తెలిపారు కేటాయించిన ఇళ్లకు సంబంధించి ఎలాంటి సందేహలు ఉన్న అధికారులకు అడిగి తెలుసుకోవాలని.రామేశ్వరం బండ గ్రామానికి చెందిన 155 మంది ghmc పరిధిలోని పటాన్చెరు చెందిన 209 మంది మరియు సికింద్రాబాద్ కు చెందిన 60 మంది లబ్దిదారులకు ఈరోజు jnnrum రామేశ్వరం బండ లోని ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,mro మహిపాల్ రెడ్డి,హౌసింగ్ బోర్డు సొసైటీ అధికారులు, రెవెన్యూ అధికారులు,జిల్లా అధికారులు ,లబ్దిదారులు పాల్గొన్నారు.