2024 ఏపీ ఎన్నికలు( AP 2024 Elections ) మే నెల 13వ తేదీన జరగనున్నాయి.సాధారణంగా ఏపీ ఎన్నికలు తొలి విడతలో జరుగుతాయని అందరూ భావించగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.అటు టీడీపీ ( TDP ) నేతలు కానీ ఇటు వైసీపీ( YCP ) నేతలు కానీ ఇప్పటివరకు ప్రచారం మొదలుపెట్టలేదు.
ఈరోజు లేదా ఈ వారం నుంచి ప్రచారం మొదలుపెట్టేలా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ప్రణాళిక ఉంది.
కొన్ని జిల్లాలలో వైసీపీ బలంగా ఉండగా మరికొన్ని జిల్లాలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి( TDP BJP Janasena Alliance ) బలంగా ఉంది.
అయితే ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప జిల్లాలలో మాత్రం వైసీపీ హవా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అనుకూల సర్వేలలో సైతం ఈ జిల్లాలలో మెజారిటీ స్థానాలు వైసీపీ సొంతం చేసుకుంటోంది.2019 ఎన్నికల్లో ఈ జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ ఈ జిల్లాల్లో అదే మ్యాజిక్ రిపీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో( Kurnool District ) 14 నియోజకవర్గాలు, ఉమ్మడి కడప జిల్లాలో( Kadapa District ) 10 నియోజకవర్గాలు ఉండగా 24 నియోజకవర్గాలలో 2019 ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.ఈ జిల్లాలలో ఇప్పటికీ వైసీపీ బలంగా ఉంది.వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కొంతమేర కష్టపడినా ఈ ఎన్నికల్లో సులువుగానే విజయం సాధించే ఛాన్స్ అయితే ఉంది.2014 ఎన్నికల్లో సైతం ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి.
సీఎం జగన్( CM Jagan ) 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలలో ఎవరెవరు పోటీ చేస్తారో ప్రకటించగా త్వరలో మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నారు.టీడీపీని ఇచ్చిన హామీలను మించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే హామీలతో వైసీపీ అడుగులు వేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో 50కు పైగా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటాపోటీ అనేలా పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఏ రాజకీయ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.