వివాదాస్పద నటిగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నటువంటి వారిలో నటి పూనమ్ కౌర్( Poonam Kaur ) ఒకరు.ఈమె సినిమాలలో నటించి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దానికన్నా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.
ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నటువంటి పూనమ్ తాజాగా మరో మంట పెట్టారు.
ఇక ఈమె ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.ట్విట్టర్ వేదికగా ఈమె దాసరి నారాయణరావు ( Dasari Narayanarao ) గారితో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.దాసరి నారాయణ రావు గారు గతంలో ఇండస్ట్రీకి పెద్దగా ఉండేవారు ఈయన ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తిన ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా అందరికీ సమన్యాయం చేసేవారు.
అంతేకాకుండా టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తూ ఉండేవారు అందుకే దాసరి గారు అంటే అందరికీ ఎంతో గౌరవం.
ఇక ఈయనని అందరూ కూడా గురూజీ( Guruji ) అంటూ పిలుచుకునేవారు.ఈ క్రమంలోనే పూనమ్ సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఆయనతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.ఈ విషయం నేను ఇది వరకు ఎన్నో సార్లు చెప్పాను.
ఇప్పుడూ చెబుతున్నాను.ఇండస్ట్రీలో గురు అనే పదానికి ఒక్కరు మాత్రమే అర్హులు అది దాసరి నారాయణరావు గారు మాత్రమే గురూజీ అనే పదానికి అర్హత కలిగి ఉన్నారు.
మిగతా వాళ్లు స్క్రిప్టులను దొంగలించగలరేమో కానీ గురువు అనే పదాన్ని మాత్రం దొంగలించలేరు అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ ను ఉద్దేశించి ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.