మాస్ మహారాజా రవితేజ( Raviteja ) – గోపీచంద్ మలినేని కాంబో ( RT4GM ) మరోసారి అఫిషియల్ అయిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో రవితేజ కొత్త మూవీ ఇటీవలే అనౌన్స్ చేసారు.
మైత్రి మూవీస్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నట్టు కూడా ప్రకటించారు.
అంతేకాదు మాసెస్ట్ కాంబో అంటూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టు కోవడమే కాకుండా ఈ కాంబోపై అంచనాలు పెంచేశారు.ఇక అప్పటి నుండి ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
మరి తాజాగా ఈ సినిమాపై స్వయంగా మేకర్స్ సాలిడ్ అనౌన్స్ మెంట్ చేసారు.
రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని( Gopichand Malineni )తో పాటు నిర్మాతలు అంత కలిసి బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి ఒక ఫోటో దిగారు.దీంతో పాటు సినిమా స్టార్ట్ అయినట్టు కన్ఫర్మ్ చేసేస్తూ ఇక నుండి వరుసగా సాలిడ్ అప్డేట్స్ ఉంటాయని ముందు ముందు అలాంటి అదిరిపోయే అప్డేట్స్ చాలా రాబోతున్నాయి అంటూ ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ పిక్ అలాగే ఈ ఇన్ఫో మాస్ రాజా ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది.ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో చేసిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswar Rao ) దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఇప్పుడు మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఈ వీకెండ్ గడిస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి.