రష్మిక మందన్న ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా అన్ని సినీ వర్గాలలో మార్మోగిపోతోంది.అతి తక్కువ సమయంలోనే తన అందం, అభినయంతో టాప్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక తెలుగు, తమిళం, కన్నడ వంటి భాషలలో నటిస్తోంది.
అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా రష్మిక మంచి ఛాన్సులు కొట్టేసింది.బాలీవుడ్లో ఇప్పటికే అమ్మడు రెండు సినిమాల్లో నటిస్తోంది.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమాతో తన ఇమేజ్ మరింత పెరిగిపోయింది.
కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన రష్మికకి 20 సంవత్సరాల వయస్సులోనే సినీ నటుడు అయిన రక్షిత్ నిశ్చితార్థం జరిగింది.
ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.అప్పటికే కన్నడలో ఒకటి, రెండు సినిమాలు సినిమాలు చేసిన రష్మిక తెలుగులో మంచి ఆఫర్లు రావడంతో కెరీర్ దృష్టి లో ఉంచుకొని వివాహాన్ని రద్దు చేసుకుంది.
నిశ్చితార్థం వరకు వచ్చిన రష్మిక రక్షిత్ పెళ్లి పెటాకులైంది.దీనికి కారణం రష్మిక అని కన్నడ అభిమానులు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు.