మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై.నిన్న నే దాదాపు మూడు గంటల పాటు సజ్జల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ తో భేటీ కావడం తెలిసిందే.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త క్యాబినెట్ కూర్పుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.ఇదిలా ఉంటే నేడు మరోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో ఎవరిని కొనసాగించాలి ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సీఎం జగన్ తో… సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చలు జరపనున్నారు.
ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది.ఇద్దరి మధ్య ప్రచారంలో ఉన్న పేర్ల గురించి చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోపక్క కొత్త మంత్రివర్గంలో దాదాపు 10 మందినీ పాత మంత్రులనే తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష పార్టీల నేతలు చేసే విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చే తరహాలో… సీనియర్ మంత్రులను కొనసాగిస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.







