ప్రస్తుత కాలంలో ఎలాంటి పోటీ పరీక్షకు అయినా కోచింగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే.ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్1 ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదు.అయితే రమ్యారెడ్డి మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి గ్రూప్1 ఉద్యోగం సాధించి ప్రశంసలు అందుకున్నారు.గ్రూప్1 ర్యాంకర్ రమ్యారెడ్డి( Ramya Reddy ) ఏపీలోని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం బద్ధిపూడికి చెందిన యువతి కాగా తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకున్నారు.
రమ్యారెడ్డి తండ్రి సాధారణ రైతు కాగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్( AP Residential School ) లో రమ్యారెడ్డి పాఠశాల విద్యను పూర్తి చేశారు.విజయవాడ, ఏలూరులో రమ్యారెడ్డి బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేశారు.చదువు పూర్తైన తర్వాత రెండేళ్ల పాటు అరబిందో ఫార్మా స్యూటికల్స్ లో పని చేసిన రమ్యారెడ్డి 2010లో పెళ్లి చేసుకున్నారు.2018 చివర్లో గ్రూప్1 నోటిఫికేషన్ వెలువడగా ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాకపోవడం ఆమెకు మైనస్ అయింది.2022 సెప్టెంబర్ లో మరోసారి గ్రూప్1 నోటిఫికేషన్( Group1 notification ) వెలువడగా ఆ సమయంలో సరైన ప్రిపరేషన్ తో రమ్యారెడ్డి తన లక్ష్యాన్ని సాధించారు.ప్రస్తుతం రమ్యారెడ్డి హెల్త్ డిపార్టుమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.
హెల్త్ డిపార్టుమెంట్ లో జాబ్ రావడంతో రమ్యారెడ్డి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కలను నెరవేర్చుకున్నానని రమ్యారెడ్డి తెలిపారు.

పెళ్లి తర్వాత ఇంకేం సాధిస్తాం అని చాలామంది చెబుతుంటారని సరైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సులువేనని రమ్యారెడ్డి కామెంట్లు చేశారు.నా సక్సెస్ స్టోరీ యువత, మహిళలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.రమ్యారెడ్డి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.రమ్యారెడ్డి సక్సెస్ స్టోరీ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.