టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుని సంచలన దర్శకుడిగా పేరు, ప్రశంసలు సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ తర్వాత రోజుల్లో వరుస విజయాలను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారనే సంగతి తెలిసిందే.ఆర్జీవీకి ఈ జనరేషన్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఆర్జీవీ సక్సెస్ రేట్ పెరగాలని వరుస విజయాలతో వర్మ కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే ఆర్జీవీ భార్యతో విడాకులు తీసుకున్నారనే విషయం అభిమానులలో చాలామందికి తెలియదు.ఆర్జీవీ తాజాగా విడాకులు తీసుకోవడం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవి మాట్లాడుతూ విడాకులు పెరగడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్ రీజన్స్ అని కామెంట్లు చేశారు.
పాత రోజుల్లో అమ్మాయిలకు ఏం చేయాలో కూడా తెలియదని ఆయన చెప్పుకొచ్చారు.ఈ జీవితానికి ఇంతేనని అప్పట్లో భావించేవారని వర్మ పేర్కొన్నారు.మ్యారేజ్ అనేది లవ్ కిల్లర్ అని ఆయన తెలిపారు.నాకు అప్పట్లో ఈ విషయాలు తెలీదు కాబట్టి పెళ్లి చేసుకున్నానని వర్మ చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకోవడం వల్లే ఈ జ్ఞానం వచ్చిందని వర్మ తెలిపారు.నేను చెప్పిన విషయాలను పెళ్లైన వాళ్లంతా ఒప్పుకుంటారని ఆయన పేర్కొన్నారు.
మనిషి చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ వేరే వాళ్ల కోసం బ్రతకడం అని వర్మ చెప్పుకొచ్చారు.నేను విడిపోయాను కాబట్టే సంతోషంగా ఉన్నానని అయన తెలిపారు.
నాకంటే చాట్ జీపీటీ గొప్ప అని వర్మ అన్నారు.వర్మ చెప్పిన విషయాలతో కొంతమంది అంగీకరిస్తే మరి కొందరు మాత్రం ఆయన చెప్పిన విషయాలలో ఏ మాత్రం నిజం ఉండదని నోటికి తోచింది ఆయన చెబుతారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.