నాట్యం అంటేనే అద్భుతం.ఇక ఆ నాట్యం నేపథ్యంలోనే సినిమా మొత్తం ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు.
ఒక కథను డాన్స్ రూపంలో చెప్పడమే నాట్యం ఈ అద్భుతమైన సినిమా రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కింది.ఈ సినిమా ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు నటిగా పరిచయం అవుతుంది.
అంతేకాదు ఈ సినిమా ద్వారా సంధ్య రాజు నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు.
ఇప్పటికే నాట్యం సినిమా నుండి విడుదల అయినా టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలు అన్నిటికి మంచి స్పందన వచ్చింది.
అంతేకాదు ఇవి సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయి.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు నిశ్రింకల ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మాత దిల్ రాజు మరియు సంధ్య రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

శ్రావణ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఇక త్వరలోనే విడుదల అవవబోతున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన ఒక అప్డేట్ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్టు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 16న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగబోతుంది.ఇక రామ్ చరణ్ అతిధిగా వస్తున్నాడంటే ఈ సినిమాపై హైప్ బాగానే వస్తుంది.
మరి చూడాలి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో.