చాలా కాలంగా హిట్ లేక బాధ పడుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth )ఇప్పుడు అలాంటి ఇలాంటి హిట్ అందుకోలేదు.ఇన్నేళ్ల దాహాన్ని ఒక్క సినిమాతో తీర్చుకుంటున్నాడు.
గత 10 ఏళ్లలో రజనీకాంత్ ఈ రేంజ్ హిట్ కొట్టిన సందర్భాలు అయితే లేవు అనే చెప్పాలి.ఈయనకు మాత్రమే కాదు ఆయన ఫ్యాన్స్ కు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు.
రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్’‘.( Jailer Movie ) ఆగస్టు 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయంగా నిలిచింది.
వీకెండ్ లో రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ తో అరాచకం సృష్టించింది.ఇక ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ కంటే ఎక్కువగానే రాబట్టింది.
ఆదివారం కలెక్షన్స్ తో కలిపి 300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది అంటున్నారు.వీకెండ్ తర్వాత వీక్ డేస్ సోమవారం రోజు కూడా జైలర్ సినిమాకు బాగానే బుకింగ్స్ జరిగాయని తెలుస్తుంది.ఇక కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో అయితే ఆగస్టు 15న మరిన్ని షోస్ వేయనున్నారట.ఆ రోజు ఉదయం 1:00, 4:00 గంటల షోస్ కూడా ఉన్నాయట.
ఆరవ రోజు కూడా ఈ రేంజ్ లో షోస్ అంటే మాములు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.మరి ఇదే క్రేజ్ కొనసాగితే 500 కోట్ల కలెక్షన్స్ సాధించడం ఖాయం అంటున్నారు.ఇక జైలర్ సినిమాకు సూపర్ స్టార్ రోల్ పెద్ద ప్లస్ అవ్వగా శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ ( Ramya Krishnan )కీలక రోల్స్ పోషించారు.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా( Tamannaah Bhatia ) హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.