తిరుమల నడక మార్గంలో మరో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది.లక్ష్మీ నరసింహ ఆలయానికి సమీపంలో చిరుత సంచరిస్తూ కనిపించిందని భక్తులు చెబుతున్నారు.
చిరుత కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీశారు.దీనిపై అప్రమత్తం అయిన టీటీడీ అధికారులు దాదాపు ఐదు చిరుతల తిరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన తరువాత అధికారులు ఏర్పాటు చేసిన బోనులో నిన్న రాత్రి ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే.