వాస్తు శాస్త్రం( Vastu Shastra )లో దిక్కులకు ప్రత్యేక స్థానం ఉంది అని దాదాపు చాలా మందికి తెలుసు.ఉత్తరం వైపున సంపదకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి, సంపదకు దేవుడు అయినా కుబేరుని నివాసం అని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అందుకోసం ఈ దిక్కుని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.అంతేకాకుండా ఈ దిశలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు నాటడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుల అనుగ్రహం, ఆశీర్వాదాలు లభిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇంటి ఉత్తర దిక్కును సంపదకు ఆదిదేవత, కుబేరుని దిక్కుగా భావిస్తారు.ఈ దిశలో డబ్బును ఆకర్షించే మొక్కలను నాటడం చాలా మంచిది.
ఇంటికి ఉత్తరం వైపున బాల్కనీ ఉంటే ఆ ఖాళీ స్థలంలో మీకు అదృష్టాన్ని తీసుకొని వచ్చే మొక్కలను నాటవచ్చు.ఉత్తర దిశలో ఏ మొక్కను నాటితే మీ సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.వెదురు చెట్లు వాస్తు ఫెంగ్ షుయ్లలో చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు.ఈ మొక్క వాస్తు శాస్త్రంలో అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.మీ ఇంటికి ఉత్తరం వైపు( North facing ) బాల్కనీ లేకపోతే మీరు ఈ మొక్కను గాజు గిన్నెలో ఏర్పాటు చేసుకోవచ్చు.అంతే కాకుండా వెదురు మొక్క ఎండిపోయి ఉంటే ఇంట్లో ఉంచకూడదని పండితులు చెబుతున్నారు.
మనీ ప్లాంట్ డబ్బును అయస్కాంతముల ఆకర్షిస్తూ ఉంటుంది.మనీ ప్లాంట్ ను ఉత్తర దిశలో నాటితే ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆర్థిక ఇబ్బందులు రావు.తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు.హిందువులందరూ తమ ఇళ్లలో తప్పనిసరిగా ఈ చెట్టును పెంచుతూ వాటిని పూజిస్తారు.ఇంట్లో శాంతి సౌఖ్యలను ఈ మొక్క ఇస్తుంది.
ఈ మొక్క పెరగడానికి తగినంత సూర్యకాంతి అవసరం.కాబట్టి సూర్య కాంతి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచాలి.
అలాగే ఉత్తర దిశలో నాటిన అరటి చెట్టు కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.ఈ చెట్టును నాటిన తర్వాత ప్రతిరోజు పూజించాలి.
ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి( Lord vishnu ) అనుగ్రహం కచ్చితంగా లభిస్తుంది.మీ ఇంట్లో ధనానికి ఎప్పటికీ లోటు ఉండదు.