బాహుబలిని రీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న రాజమౌళి అభిమానులు

Rajamouli Fans Want To Re Release Baahubali Movie , Baahubali 2 , Baahubali Re Release Date , Mahesh Babu,Prabhas,Rajamouli

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తాజాగా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.వసూళ్ల కంటే కూడా అధికంగా ఆర్ఆర్ఆర్ సినిమా కు మంచి పేరు వచ్చింది.

 Rajamouli Fans Want To Re Release Baahubali Movie , Baahubali 2 , Baahubali Re-TeluguStop.com

ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు ను దక్కించుకోవడంతో పాటు తాజాగా ఆస్కార్‌ కి కూడా నామినేట్‌ అవ్వడం జరిగింది.ఆస్కార్‌ అవార్డుకు చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమా నామినేట్‌ అవ్వడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Baahubali, Mahesh Babu, Prabhas, Rajamouli, Telugu-Movie

సోషల్‌ మీడియాలో రాజమౌళి గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.ఇదే సమయంలో రాజమౌళి యొక్క గత సినిమా బాహుబలి ని విడుదల చేయాలని ఫ్యాన్స్‌ విజ్ఞప్తి చేస్తున్నారు.తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు రాజమౌళి యొక్క గత సినిమాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.బాహుబలి రెండు పార్ట్‌ లను కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఒక మంచి సందర్భం చూసి బాహుబలి 2 ను మళ్లీ విడుదల చేస్తే కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి అంటూ చాలా నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఉన్నారు.ఈసారి అంతర్జాతీయ స్థాయి లో బాహుబలి 2 కి మంచి రెస్పాన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అందుకే హాలీవుడ్‌ లో ఈ సినిమాను విడుదల చేయాలని ఫిల్మ్‌ మేకర్స్ రాజమౌళికి సలహాలు ఇస్తున్నారు.

Telugu Baahubali, Mahesh Babu, Prabhas, Rajamouli, Telugu-Movie

మరి రాజమౌళి తన యొక్క బాహుబలి 2 సినిమా ఎప్పుడు విడుదల చేస్తాడు అనేది చూడాలి.రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబు తో చేయబోతున్న విషయం తెల్సిందే.మహేష్ బాబు సినిమా ను హాలీవుడ్‌ సినిమా ల రేంజ్ లో ఒక హాలీవుడ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి రాజమౌళి రూపొందించబోతున్నాడట.

అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.మహేష్ బాబు తో సినిమా తర్వాత బాహుబలి సినిమా ను హాలీవుడ్‌ లో మళ్లీ విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube