సోషల్ మీడియాలో కొందరు సెలబ్రెటీల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు.వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి నీచంగా మాట్లాడుతూ రాక్షసానందంను పొందుతూ ఉంటారు.
ఆ మధ్య సింగర్ సునీత రెండవ వివాహం చేసుకున్న సమయంలో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.ఆమె రెండవ పెళ్లి ఏదో పెద్ద తప్పు అన్నట్లుగా కొందరు విమర్శించారు.
ఆమె తన పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా సంవత్సరాల పాటు సింగిల్ పేరెంట్ గానే ఉన్నారు.
ఆమె పిల్లలు పెద్ద వారు అయ్యి తమ తల్లికి తోడు కావాలనే ఉద్దేశ్యంతో పెళ్లి కి ఒప్పిస్తే ఆమె వివాహానికి సిద్ధం అయ్యిందే తప్ప తనంతట తాను పెళ్లికి సిద్ధం అవ్వలేదు.ఆ సమయంలో చాలా మంది సునీత యొక్క వివాహం గురించి నీచంగా మాట్లాడటం తో పాటు డబ్బు కోసం పెళ్లి చేసుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.దాంతో సునీత గురించి రకరకాలుగా మీడియాలో ఆ సమయంలో ప్రచారం జరిగింది.
ఇప్పుడు కూడా సునీతను కొందరు టార్గెట్ చేస్తున్నారు. సునీత తల్లి కాబోతుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమె యొక్క మార్ఫింగ్ ఫొటోలను షేర్ చేస్తూ ఉన్నారు.బుద్దిలేని వారి యొక్క పోస్ట్ లను సునీత ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతరులు కూడా బ్లాక్ చేస్తూ ఉన్నారు.ఇలాంటి నీచమైన ప్రచారం సరైనది కాదు అంటూ వారిని హెచ్చరిస్తున్నారు.
సునీత గురించి వారు ప్రచారం చేస్తున్న వార్తలు అన్నీ కూడా గాలి వార్తలే అని.బుద్దిలేని వారు ప్రచారం చేస్తున్న కథనాలు అన్నట్లుగా సునీత అభిమానులు అంటున్నారు.ముందు ముందు కూడా సునీత గురించి ఇలాంటి పిచ్చి వార్తలు వస్తూనే ఉంటాయి.కనుక అభిమానులు ఆ వార్తల గురించి పట్టించుకోవద్దు అంటూ ఆమె సన్నిహితులు మరియు మీడియా సర్కిల్స్ వారు చెబుతున్నారు.