కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది.ఈ మేరకు తెలంగాణలో సాగే రాహుల్ గాంధీ పాదయాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా పాల్గొనాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది.
కాగా రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో ఇప్పటికే పార్టీ నేతలు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.ప్రధాన నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రను కొనసాగించనున్నారు.