రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు - మాజీ మంత్రి కొండా సురేఖ

వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పి.రామ్మోహన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడిన కొండా సురేఖ.

 Rahul Gandhi Suspension Is Against Democracy Former Minister Konda Surekha, Rahu-TeluguStop.com

కొండా సురేఖ కామెంట్స్….రాహుల్ గాంధీ ఎక్కడా కూడా విద్వేషపూరిత ప్రసంగాలు చేయలేదు.

నేడు మన రాష్ట్రంలో బీజేపీ నాయకులు బండి సంజయ్, అరవింద్ లాంటి వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.రాహుల్ గాంధీ ని చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి భయం అందుకే అనర్హత వేటు.

కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో ఉన్న నాయకులను ఉద్దేశించి మాట్లాడితే అనర్హత వేటు వేస్తారా.ఉరి శిక్ష పడిన వారు సైతం పై కోర్టు వెళ్లే అవకాశం ఉంటుంది….

ఒక కోర్టు ఇచ్చిన తీర్పుతో అనర్హత వేటు వేయడం అంటే రాహుల్ గాంధీ ని చూస్తే ఎంత భయవేస్తుందో అర్ధమవుతుంది.

ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం రాహుల్ గాంధీ దీ…ప్రజల అవసారల కోసం ఎంతకైనా పోరాడుతారు.

ఇమిడేట్ గా క్వార్టర్ ను కాళీ చేయమనడం దుర్మార్గం…నేడు చిన్న పిల్లలు సైతం రాహుల్ మామా మా ఇంటికి రండంటూ ప్లే కార్డులు ప్రదర్శిస్తున్నారు.ఎన్ని కేసులు పెట్టిన… జైలుకు పంపినా కాంగ్రెస్ కార్యకర్తలు… నాయకులు భయపడే ప్రసక్తే లేదు.

పేపర్ లీకేజ్ పై రేవంత్ రెడ్డి మాట్లాడితే సీట్ నోటీస్ ఇస్తూ పరువు నష్టం దావా వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.

రాహుల్ గాంధీ పై వేసిన వేటు తొలగించే వరకు ఎన్ని పోరాటలైన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube