పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయుల సమస్యలపై సీఎం భగవంత్ మాన్ సర్కార్( CM Bhagwant Mann ) దృష్టి సారించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎన్ఆర్ఐల కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్‌లలో ప్రత్యేక పోస్టుల భర్తీపైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
తాజాగా ఎన్ఆర్ఐలకు పెద్ద ఉపశమనం కలిగించారు భగవంత్ మాన్.సింగిల్ క్లిక్‌తో ఎన్ఆర్‌ఐలు రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకునేందుకు గాను ‘‘ eservices.
punjab.gov.in ’’ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.‘‘ఈ – గవర్నెన్స్’’( E Governance )లో ఇది విప్లవాత్మకమైన అడుగుగా అభివర్ణించారు.కొన్ని సందర్భాల్లో భారతదేశానికి వెలుపల నివసిస్తున్న వ్యక్తి (ఎన్ఆర్ఐ లేదా ఓసీఐ) పంజాబ్‌లో వున్న ఆస్తిని విక్రయించడం, కొనడం, అద్దెకు ఇవ్వడం, స్వాధీనం చేసుకోవడం వంటివి చేయాల్సి వుంటుందన్నారు.అయితే సంబంధిత వ్యక్తి భారతదేశాన్ని సందర్శించలేరని , అలాగే పత్రాలను నమోదు చేసుకోవడానికి వ్యక్తిగతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి హాజరుకాలేరని సీఎం అన్నారు.
అలాంటి ఎన్ఆర్ఐ( NRI )లకు ఊరట కలిగించేందుకు మొత్తం ప్రక్రియను ఇప్పుడు డిజిటలైజేషన్ చేశామని భగవంత్ మాన్ తెలిపారు.ఈ క్రమంలోనే పత్రాల ఎంబాసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

ఈ పత్రాలను జిల్లా, డివిజనల్ కమీషనర్ లేదా ఫైనాన్షియల్ కమీషనర్ వంటి అధికారులు పేర్కొన్న షరతుల ఆధారంగా సమర్పించవచ్చని సీఎం వెల్లడించారు.దరఖాస్తును సమర్పించిన తర్వాత దానిని ట్రాక్ చేసుకోవచ్చని భగవంత్ మాన్ పేర్కొన్నారు.స్లాట్ బుకింగ్( Slot Booking ) అనే ఫీచర్ ద్వారా దరఖాస్తుదారులు తమకు ఇష్టమైన తేదీ, సమయాన్ని ఎంచుకోవడానికి వీలు కలుగుతుందని సీఎం తెలిపారు.దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో అవసరమైన రుసుమును కూడా జమ చేయవచ్చని చెప్పారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సదుపాయంపై పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.