చేపల కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.అందులో పులస చేప అంటే మాత్రం లొట్టలేసుకుంటూ జనం తింటారు.
మిగతా చేపల ధరల కంటే వీటి ధర ఎక్కువగా ఉన్నా కూడా, సీజన్‌లో మరియు ప్రత్యేకంగా పులస చేపలు గోదావరి నదిలో మాత్రమే ఇవి దొరుకుతాయి.కాబట్టి, ప్రజలు వీటిని తినడానికి ఎంతో ఇష్టపడతారు.
ప్రస్తుతం ఎగువన ఉన్న ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో, గోదావరి నదిలోని వరద నీరు మొత్తం సముద్రంలోకి వెళ్లడం జరుగుతుంది.
దీంతో వరద నీటికి ఎదురీది పులస చేపలు సంతానం కోసం గోదావరి నదిలోకి వస్తాయి.
ఇలా వెళ్లే చేపలను జాలర్లు వల వేసి పట్టుకుంటారుఅయితే, ఇదే విధంగా గోదావరిలోని వచ్చిన పులస చేపను నిన్న యానాంకు చెందిన జాలర్లు వల వేసి పట్టుకున్నారు.పులస చేపను పట్టుకున్న విషయం తెలుసుకున్నా స్థానికులు, దానిని కొనేందుకు ఎగబడ్డారు.
అందరి అనుమతితో వేలంపాట వేయగా, గరిష్టంగా ఆరు వేల రూపాయలకు అమ్ముడుపోయింది.

దాదాపు కిలోకు పైగా బరువు ఉన్న పులస చేప ఆరు వేలకు అమ్ముడుపోవడంపై సదరు విక్రేత పొన్నమండ రత్నం అనే మహిళ ఆనందం వ్యక్తి చేసింది.వరదలు రావడంతోనే పులస చేపల సీజన్ మొదలైందని, రాబోయే కాలంలో మరిన్ని పులస చేపలను పట్టుకుంటామని జాలర్లు తెలిపారు.అయితే వీటి రుచి గురించి స్థానిక జాలర్లను ప్రశ్నించగా, వరద నీరు మరియు మట్టి కలిసి ఉండటం వల్ల వీటిలో ఉన్న ఈ పులస చేపల రుచి మిగతా వాటి కంటే చాలా భిన్నంగా, రుచిగా ఉంటుందని జాలర్లు చెప్పారు.
అంతేకాకుండా, ఇవి సీజన్‌లో కొన్ని రోజులు మాత్రమే లభిస్తాయి కాబట్టి, ధర కూడా అందనంత ఎత్తులో ఉంటుందని వివరించారు.